న్యూఢిల్లీ: ఈ–ఆధార్ కార్డులపై భద్రమైన క్యూఆర్ కోడ్‌లను యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ప్రవేశపెట్టింది. ఈ–ఆధార్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తే ఇప్పటివరకు కార్డుదారుడి వివరాలే వచ్చేవి. ఇకపై కార్డుదారుడి ఫొటో కూడా కనిపించనుంది. అలాగే ఇది డిజిటల్ రూపంలో సంతకం చేసిన క్యూఆర్ కోడ్ అని యూఐడీఏఐ చెప్పింది.
కొత్త క్యూఆర్ కోడ్ విధానం వల్ల అనేక సంస్థలు వినియోగదారుడి ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో తనిఖీచేసి నకిలీలను గుర్తించే అవకాశం కలుగుతుంది. ‘ఆధార్ కార్డు నిజమైనదో కాదో తెలుసుకునేందుకు ఇదొక సరళమైన పద్ధతి’ అని యూఐడీఏఐ చెప్పింది. గత నెల 27 నుంచే యూఐడీఏఐ తన వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment