E-Aadhar card
-
ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం!
మన దేశంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఇప్పుడు ఆధార్ కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్ల వాడి నుంచి 60 ఏళ్ల వృద్దిడి వరకు ప్రతి ఒక్కరికీ దీనితో చాలా అవసరం ఉంటుంది. చివరికి కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్‌నే ప్రధానంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. పలు రకాల సేవలను ఆన్లైన్లోనే అందిస్తోంది. మాస్క్డ్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఐడీఏఐ. ఈ ఫీచర్ వల్ల మీ ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరుతుంది. కొత్తగా తీసుకొచ్చిన మాస్క్ ఆధార్ ఆప్షన్ వల్ల మీరు డౌన్లోడ్ చేసిన ఈ-ఆధార్ లో మొదటి 8 అంకెలను "ఎక్స్ ఎక్స్ ఎక్స్" వంటి కొన్ని అక్షరాలతో భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో మీ ఆధార్ నెంబరు చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల మీ ఆధార్ ఇతరులు తెలుసుకోలేరని యూఐడీఏఐ పేర్కొంది. ఇతర వివరాలు అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి. ఈ ఫీచర్ మీ కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది. మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..? మొదట యూఐడీఏఐ వెబ్ సైట్(https://uidai.gov.in/) ఓపెన్ చేయండి. "మై ఆధార్ ఆప్షన్" ఎంచుకోండి. "మై ఆధార్" ట్యాబ్ కింద 'డౌన్లోడ్ ఆధార్' మీద క్లిక్ చేయండి. ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్, ఎన్ రోల్ మెంట్ ఐడీ(ఈఐడీ), వర్చువల్ ఐడీ(విఐడీ) 3 ఆప్షన్లు ఉన్నాయి. పై ఆప్షన్ లన్నింటిలో ఏదో ఒకటి ఎంచుకొని 'I want a masked Aadhaar?' అనే దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాప్చ ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. వెబ్ సైట్ లో ఓటీపీని నమోదు చేసి మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్! -
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆధార్‌లోని ఫొటో
న్యూఢిల్లీ: ఈ–ఆధార్ కార్డులపై భద్రమైన క్యూఆర్ కోడ్లను యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ప్రవేశపెట్టింది. ఈ–ఆధార్‌పై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే ఇప్పటివరకు కార్డుదారుడి వివరాలే వచ్చేవి. ఇకపై కార్డుదారుడి ఫొటో కూడా కనిపించనుంది. అలాగే ఇది డిజిటల్ రూపంలో సంతకం చేసిన క్యూఆర్ కోడ్ అని యూఐడీఏఐ చెప్పింది. కొత్త క్యూఆర్ కోడ్ విధానం వల్ల అనేక సంస్థలు వినియోగదారుడి ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో తనిఖీచేసి నకిలీలను గుర్తించే అవకాశం కలుగుతుంది. ‘ఆధార్ కార్డు నిజమైనదో కాదో తెలుసుకునేందుకు ఇదొక సరళమైన పద్ధతి’ అని యూఐడీఏఐ చెప్పింది. గత నెల 27 నుంచే యూఐడీఏఐ తన వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఈ-ఆధార్‌తో సిమ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ-ఆధార్ కార్డు కాపీని చూపించి మొబైల్ ఫోన్లకు కొత్త సిమ్‌లు కొనుగోలు చేసుకునేలా వినియోగదారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అవకాశం కల్పించింది. ఈ-ఆధార్ కార్డునే అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తారు. కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి లభించే ఇ-ఆధార్ లేఖ/డౌన్లోడ్ చేసుకున్న కార్డునే మొబైల్ కనెక్షన్ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణ కోసం వినియోగించవచ్చు. ఇ-ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని.. వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని డీఓటీ సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని సిమ్‌కార్డు అమ్మేవారు స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించింది. మొబైల్ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాధ్యూస్, ఆస్పి సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ టెలికాం విభాగాన్ని కోరారు. ఆధార్ కార్డుకు, యూఐడీఏఐ వెబ్సైట్ ఇ-ఆధార్ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం ఇలాంటి వారికి ఉపయోపడుతుంది.