ఈ-ఆధార్‌తో సిమ్ తీసుకోవచ్చు | Now use E-Aadhar card to buy a new mobile connection | Sakshi
Sakshi News home page

ఈ-ఆధార్‌తో సిమ్ తీసుకోవచ్చు

Published Thu, Jul 14 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

Now use E-Aadhar card to buy a new mobile connection

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-ఆధార్ కార్డు కాపీని చూపించి మొబైల్ ఫోన్లకు కొత్త సిమ్‌లు కొనుగోలు చేసుకునేలా వినియోగదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అవకాశం కల్పించింది. ఈ-ఆధార్ కార్డునే అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తారు. కొత్తగా మొబైల్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు.

యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి లభించే ఇ-ఆధార్‌ లేఖ/డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డునే మొబైల్‌ కనెక్షన్‌ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణ కోసం వినియోగించవచ్చు. ఇ-ఆధార్‌ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని.. వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని డీఓటీ సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్‌ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని సిమ్‌కార్డు అమ్మేవారు స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించింది.

మొబైల్‌ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్‌ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (కోయ్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాధ్యూస్‌, ఆస్పి సెక్రటరీ జనరల్‌ అశోక్‌ సూద్‌ టెలికాం విభాగాన్ని కోరారు. ఆధార్‌ కార్డుకు, యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఇ-ఆధార్‌ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్‌ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్‌ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్‌ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం ఇలాంటి వారికి ఉపయోపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement