న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ చెయ్యా లని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకి ముందే డిజిటల్ ఫార్మేట్‌లోకి మార్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల ఓటరు తమ గుర్తింపు కార్డుని పోలింగ్ బూతులకి వెంట తీసుకువెళ్లాల్సిన పని ఉండదు. అంతేగాక క్యూఆర్ కోడ్‌ల ద్వారా సమాచారాన్ని కార్డులో ఉంచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. దీంతో విదేశాల్లో ఉన్న వారు కూడా తమ కార్డుని ఒక్క క్లిక్ సాయంతో క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment