
ఆండ్రాయిడ్ 12లో వైఫై పాస్‌వర్డ్ షేర్ చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్స్ తమ వైఫై నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్‌లో నియర్‌బై షేర్ ద్వారా వైఫై పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవడానికి వినియోగదారులను సహాయపడనుంది. ఆపిల్ యొక్క ఎయిర్‌డ్రాప్ టెక్నాలజీని తరహాలోనే ఇది కూడా పనిచేయనుంది. క్రొత్త ఫీచర్‌లో ఆండ్రాయిడ్ షేర్ వైఫై పేజీలో షేర్ బటన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. షేర్ బటన్ నొక్కడం ద్వారా రెండు ఫోన్ల మధ్య ఎటువంటి కేబుల్ సహాయం లేకుండా వైఫైకి కనెక్ట్ చేయబడిన ఫోన్ నుంచి వైఫై పాస్‌వర్డ్‌ను వినియోగదారులు షేర్ చేసుకోవచ్చు.(చదవండి: ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!)
ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 ఓఎస్ యూజర్స్‌కి క్యూఆర్ కోడ్ ఆధారంగా వైఫై పాస్‌వర్డ్ షేర్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైనల్ వెర్షన్ ని ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో తీసుకురానున్నట్లు సమాచారం. షేర్ వైఫై పేరుతో ఈ ఏడాడి రెండో అర్ధభాగంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఇప్పటికే దీని సంబంధించిన కార్యచరణను గూగుల్ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment