మీ మిత్రుడు, బంధువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మర్చిపోయారా? అర్ధరాత్రి వారిని లేపకుండానే వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా. అయితే, మీకు ఒక శుభవార్త. గూగుల్ తన మెసేజిస్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చిన గూగుల్. తాజాగా, షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ తీసుకొనివస్తుంది. దీని ద్వారా మీరు మీ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. మీరు మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ ఫోన్‌లో గూగుల్ మెసేజ్ తాజా వెర్షన్(7.4.050 )ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ కేవలం గూగుల్ మెసేజ్ యాప్ లో మాత్రమే వర్తిస్తుంది. మీ ఫోన్ లో వచ్చిన మెసేజ్ యాప్ లో ఈ ఫీచర్ వర్తించదు. మీరు మెసేజ్ లను షెడ్యూల్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ అనుసరించండి.
- మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ సందేశాన్ని టైప్ చేయండి
- తర్వాత సేండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్(ఎక్కువ సేపు) చేయండి.
- ఇప్పుడు మీకు తేదీలు, సమయం చూపించే ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది.
- దానిలో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేస్తే సరిపోతుంది.
- దీని ద్వారా మీ ఫొటోలు, వీడియోలు కూడా షెడ్యూల్ చేయవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment