మీకు నచ్చిన సమయానికే ఈ-మెయిల్‌ను ఇలా సెండ్‌ చేయండి...! | Gmail Scheduling Tool To Send Email Messages Later | Sakshi
Sakshi News home page

Gmail:మీకు నచ్చిన సమయానికే ఈ-మెయిల్‌ను ఇలా సెండ్‌ చేయండి...!

Published Sat, Aug 21 2021 5:47 PM | Last Updated on Sat, Aug 21 2021 7:31 PM

Gmail Scheduling Tool To Send Email Messages Later - Sakshi

నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తర ప్రత్యుత్తరాలను పంపడానికి జీ-మెయిల్‌, యాహూ, వంటి మెయిల్‌ ప్రొవైడర్స్‌పై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ వచ్చిన తొలినాళ్లలో ఆర్‌కూట్‌ వంటి ఈ-మెయిల్‌ సేవలు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా ఆర్‌కూట్‌ స్థానంలో యాహూ, గూగుల్‌ వంటి సంస్థలు తమ సొంత మెయిల్‌ సర్వీస్‌లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం మనలో చాలా మంది జీమెయిల్‌ సర్వీస్‌లనే ఎక్కువగా వాడుతుంటాం.

మొదట్లో జీ-మెయిల్‌ షెడ్యూల్డ్‌ సమయానికి పంపే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో బూమ్‌ర్యాంగ్‌ వంటి థర్డ్‌పార్టీ మెయిల్‌  యాప్స్‌ను ఉపయోగించి యూజర్లు అనుకున్న సమయానికి మెయిల్స్‌ను పంపేవారు. జీ-మెయిల్‌ తన యూజర్ల కోసం షెడ్యూల్డ్‌ ఈ-మెయిల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఫలానా సంస్థలకు లేదా కార్యాలయాలకు మీకు నచ్చిన సమయానికి ఈ-మెయిల్స్‌ను ఇలా పంపండి.
చదవండి: Amazon Prime: అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ గమనించారా..!

బ్రౌజర్‌నుపయోగించి జీ-మెయిల్‌ నుంచి ఇలా మెయిల్‌ సెండ్‌ చేయండి.

  • మీ జీమెయిల్‌ అకౌంట్‌లో లాగిన్‌ అవ్వండి.
  • ముందుగా కంపోస్‌ మెయిల్‌ను సెలక్ట్‌చేసి మీ సమాచారాన్ని, రెసిపెంట్‌ మెయిల్‌ అడ్రస్‌ను టైప్‌ చేయండి. 
  • తరువాత సెండ్‌ ఆప్షన్‌ పక్కనే ఉన్న డ్రాప్‌ డౌన్‌ ట్రయాంగిల్‌ సింబల్‌పై క్లిక్‌ చేయండి.

  • క్లిక్‌ చేసిన తరువాత మీకు ‘షెడ్యూల్డ్‌ సెండ్‌ ఆప్షన్‌’ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్‌ చేస్తే మీకు ఫలానా సమయంలో మెయిల్స్‌ వెళ్లే ఆప్షన్‌ను జీమెయిల్‌ డిఫాల్ట్‌గా చూపిస్తుంది.
  • ఒక వేళ డిఫాల్ట్‌ సమయానికి కాకుండా మీకు నచ్చిన సమయం కోసం పిక్‌ అండ్‌ డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీకు నచ్చిన సమయాన్ని ఎంచుకోవాలి. మీ  మెయిల్‌ షెడ్యూల్‌ అయ్యిందని జీ​-మెయిల్‌ డ్రాఫ్ట్‌లో సేవ్‌ అయి ఉంటుంది. ఒక వేళ మెయిల్‌లో ఏవైనా పొరపాట్లు వచ్చినా తిరిగి మెయిల్‌ను సేవ్‌ చేసుకునే సౌకర్యం మీకు ఉంటుంది. 

ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌​ నుంచి ఇలా మెయిల్‌ సెండ్‌ చేయండి..!

  • మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో జీమెయిల్‌  యాప్‌ను సెలక్ట్‌ చేయండి.
  • కింద కన్పించే కంపోస్ అప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • మెయిల్‌ కంపోస్‌ చేసిన తరువాత పక్కనే ఉన్న  త్రీడాట్స్‌పై క్లిక్‌ చేయండి.
  • త్రీడాట్స్‌ను ఎంపిక చేసిన వెంటనే మీకు షెడ్యూల్‌ టై అనే ఆప్షన్‌ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్‌ చేసి పైనా చెప్పిన విధంగా మీ ఈ-మెయిల్‌ను షెడ్యూల్‌ చేసుకోండి. 

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement