మీరు మీ స్నేహితుల, బందువుల, ఇష్టమైన వారి పుట్టిన రోజు లేదా ఇతర వేడుకలు సంబందించి అందరికి కంటే ముందుగా శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారా?. అయితే, దీని కోసం మీరు సమయాన్ని వృదా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి గూగుల్ మెసేజెస్ ద్వారా సాదారణ టెక్స్ట్ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. చాలా సులభంగా సందేశాలను షెడ్యూల్ చేయవచ్చు. సందేశాలను షెడ్యూల్ చేయాలంటే కచ్చితంగా మీ ఫోన్ మొబైల్ డేటా లేదా వై-ఫైకి కనెక్ట్ కావాలని గుర్తుంచుకోండి. అలాగే, గూగుల్ మెసేజెస్ కొత్త వెర్షన్(7.8.064) ఇన్స్టాల్ చేసుకోవాలి.
గూగుల్ మెసేజెస్ తో టెక్స్ట్ మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి?
- మీ ఫోన్‌లో టెక్స్ట్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వారి నెంబర్ ఎంచుకోండి.
- ఇప్పుడు మీరు షెడ్యూల్ చేయదలిచిన సందేశాన్ని టైప్ చేయండి, కానీ అప్పుడే సెండ్ బటన్‌పై నొక్కకండి.
- మీ సందేశం టైపు చేశాక సెండ్ బటన్‌ను అలాగే నొక్కి పట్టి ఉంచండి, ఇప్పుడ మీకు షెడ్యూల్ సెండ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది.
- మీకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేసి సెండ్ బటన్ మీద నొక్కండి.
- ఇప్పుడు మీరు చేసిన షెడ్యూల్ సమయానికి మెసేజ్ వారికి వెళ్తుంది.
- తేదీ, సమయాన్ని మార్చడానికి షెడ్యూల్ చేసిన మెసేజ్ పక్కన కనిపిస్తున్న క్లాక్ సింబల్ మీద క్లిక్ చేసి అప్డేట్ మెసేజ్ నొక్కడం ద్వారా మార్చుకోవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment