న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది.
‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్‌డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment