రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అది వెయిటింగ్ లిస్టులో ఉండటం చాలాసార్లు జరుగుతుంది. అయితే, ముందే బుక్ చేసిన టికెట్లు తర్వాత కన్ఫర్మ్ అయ్యాయో లేదో తెలుసుకోడానికి మనం 139కు ఫోన్ చేయడం గానీ, ఇంటర్నెట్లో చూసుకోవడం గానీ తప్పనిసరి. లేకపోతే మనకు తెలియదు. కానీ ఇప్పుడా కష్టాలు తీరినట్లే. ఎందుకంటే, వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయితే, ప్రయాణికులకు ఆటోమేటిగ్గా ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ తాజాగా కల్పించింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన సెల్ నెంబరుకే ఈ ఎస్ఎంఎస్ వస్తుంది. దాంతో ఇక ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేకుండా టికెట్ స్టేటస్ తెలిసిపోతుంది. సాధారణంగా రైలు బయల్దేరడానికి రెండు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఆ సమయానికల్లా ఎస్ఎంఎస్ వస్తుందన్న మాట. దాంతో ప్రయాణం కోసం రైల్వేస్టేషన్కు వెళ్లాలా, అక్కర్లేదా అన్న విషయం కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే, కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ ఎస్ఎంఎస్లు వెళ్తాయి. ఎస్ఎంఎస్ రాలేదంటే ఆ టికెట్ కన్ఫర్మ్ కాలేదని మనం నిర్ధారించుకోవచ్చు.
Published Sun, Feb 9 2014 4:39 PM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement