మేడారం జాతరకు హెలికాప్టర్‌  | Helicopter services to Medaram fair | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు హెలికాప్టర్‌ 

Published Sun, Feb 18 2024 4:24 AM | Last Updated on Sun, Feb 18 2024 4:24 AM

 Helicopter services to Medaram fair - Sakshi

ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది.  

చార్జీలు ఇలా... 
ఒక్కో ప్యాసింజర్‌ (అప్‌ అండ్‌ డౌన్‌)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతర­లో ఏరియల్‌ వ్యూరైడ్‌ ఒక్కొ­క్క­రికి రూ.4,800.  

బుకింగ్‌ ఇలా..: 
హెలికాప్టర్‌ టికెట్‌ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో info@helitaxi. com ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement