వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్‌కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది.
ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.
వాట్సప్‌లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..
వాట్సప్‌లో మెట్రో టికెట్ బుకింగ్ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు 8624888568 (నాగపూర్ మెట్రో), 8341146468 (హైదరాబాద్ మెట్రో) నంబర్‌కు 'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్‌బాట్ టికెట్ బుకింగ్‌ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందిస్తుంది.
ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.
వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment