- టికెట్ బుకింగ్ క్లర్క్ వద్ద లభించిన అదనపు డబ్బు
కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో విజిలెన్స్ దాడులు
Published Mon, Sep 12 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
కాజీపేట రూరల్ : కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ దాడులు జరిగాయి. సికింద్రాబాద్ విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ కౌంట ర్‌లో తనిఖీ చేయగా, బుకింగ్ క్లర్క్ జేబులో టికెట్ల డబ్బులు కాకుండా అదనంగా కొంత దొరికాయి. దీనిపై అధికారులు ప్రశ్నించగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించేందుకు తన సొంత డబ్బులు తీసుకొచ్చానని చెప్పాడు.
దీంతో అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతో పాటు అదనపు డబ్బును రైల్వే ఖాతాలో జమ చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యాక కేసు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విజిలెన్స్ దాడులతో రైల్వే అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొన్ని విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నారని సమాచారం.
Advertisement
Advertisement