రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని | Salman Khans Crazy Fan Book 150 Tickets Of Dabangg 3 | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ సినిమాకు అన్నేసి టికెట్లా?

Published Wed, Dec 18 2019 2:43 PM | Last Updated on Wed, Dec 18 2019 3:45 PM

Salman Khans Crazy Fan Book 150 Tickets Of Dabangg 3 - Sakshi

ఇష్టమైన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అభిమానులు దాన్ని ఓ పండగలా జరుపుకుంటారు. హీరో కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తారు. థియేటర్ల ముందు క్యూ కడుతారు. పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. ఇక్కడ మనం చెప్పుకునే వీరాభిమాని అంతకుమించిన పని చేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలిచాడు. విజయ్‌ అనే వ్యక్తి చుల్‌బుల్‌ పాండే(సల్మాన్‌ ఖాన్‌)కు డైహార్డ్‌ ఫ్యాన్‌. తాజాగా సల్మాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ శుక్రవారం విడుదల కానుండటంతో విజయ్‌ ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకున్నాడు.

కానీ తన ఒక్కడికో, కుటుంబానికో లేదా ఫ్రెండ్స్‌కో సరిపడా టికెట్లు కొనలేదు. ఏకంగా 150 టికెట్లు కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు ఓ మినీ థియేటర్‌నే బుక్‌ చేశాడనుకోండి. జమ్ము అనే ఫ్యాన్స్‌ క్లబ్‌ కూడా దబాంగ్‌ 3 కోసం ముందస్తుగా 100 టికెట్లు కొనుగోలు చేసింది. గతంలో సల్మాన్‌ నటించిన రేస్‌ 3 చిత్రం అంతంతమాత్రంగానే ఉందని విమర్శకులు పెదవి విరిచారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా రూ.300 కోట్ల మైలురాయిని చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే అతని అభిమాన ఘనం బలమేంటో అర్థమవుతోంది. ఇక ‘దబాంగ్‌ 3’ ట్రైలర్‌ 50మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాతో ఈ యేడు మంచి ముగింపును పలకడానికి సల్మాన్‌ రెడీ అయిపోయాడన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement