Paytm Offers Special Flight Fares For Armed Forces Students Senior Citizens - Sakshi
Sakshi News home page

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!

Published Tue, Dec 7 2021 4:15 PM | Last Updated on Tue, Dec 7 2021 4:28 PM

Paytm Offers Special Flight Fares For Armed Forces Students Senior Citizens - Sakshi

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్‌తో విమాన టికెట్ల బుకింగ్‌పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్‌ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. 

వీటిపై వర్తిస్తాయి..!
పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్‌ ఇండిగో, గో ఎయిర్‌, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ఎసియా సర్వీసులపై  తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్‌ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్‌ట్రా బ్యాగేజ్‌ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. 

చదవండి: పేటీఎం ఢమాల్‌..! రూ.38 వేల కోట్ల లాస్‌ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్‌..!

ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన  సెగ్మెంట్‌. ట్రావెలింగ్‌ విషయంలో  కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్‌ డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్‌ టికెట్లను, ఇంటర్‌సిటీ బస్సులను, రైల్‌ టికెట్లను బుక్‌ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది.  కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. 
చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement