సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు రెండో దశ వందే భారత్ మిషన్‌కు కేంద్రం అన్ని సన్నాహాలు పూర్తి చేసిందని హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మే 16 నుంచి 22 వరకు సుమారు 149 విమానాలను వివిధ దేశాలకు పంపనున్నట్టు తెలిపారు. రెండో దశలో భాగంగా తెలంగాణకు 16, ఆంధ్ర ప్రదేశ్‌కు 9, కర్ణాటక–17, కేరళ–31, ఢిల్లీ–22, గుజరాత్–14, రాజస్తాన్–12, పంజాబ్–7 బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు 6 చొప్పున, చండీగఢ్–2 మహారాష్ట్ర–1 మధ్యప్రదేశ్–1, జమ్మూకశ్మీర్–1 చొప్పున విమానాలు కేటాయించినట్టు తెలిపారు. (78 వేలు దాటిన కేసులు)
సింగపూర్, అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఒమన్, మలేసియా, ఫిలిప్పీన్స్, రష్యా, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, జార్జియా, కువైట్, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, ఆర్మేనియా, థాయిలాండ్, బెలారస్, నైజీరియా, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి భారతీయులను తరలించనున్నట్టు తెలిపారు. కాగా వందే భారత్ మిషన్ కింద ఇప్పటికే 13 దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను 64 విమానాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తరలించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే రెండో దశ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. (రైతులకు 2 లక్షల కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment