
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానయానాన్ని నియంత్రించే డీజీసీఏ మంగళవారం స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్‌గా అన్‌ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలని తెలిపింది. అన్‌ఫిట్ లక్షణాలు 14 రోజులకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్‌నెస్ ఉందో లేదో చెబుతామంది. పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత విమానాల్లో పని చేసే సిబ్బందిని అరగంట పాటు వైద్యులు పరిశీలిస్తారని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment