‘నో ఫ్లై లిస్ట్‌’లో బంగారం వ్యాపారి | Mumbai man Birju Kishore Salla becomes first to be put on no-fly list | Sakshi
Sakshi News home page

‘నో ఫ్లై లిస్ట్‌’లో బంగారం వ్యాపారి

Published Mon, May 21 2018 5:35 AM | Last Updated on Mon, May 21 2018 5:35 AM

Mumbai man Birju Kishore Salla becomes first to be put on no-fly list - Sakshi

న్యూఢిల్లీ: ప్రియురాలిని ఉద్యోగం మాన్పించి.. తనతో పాటు తీసుకెళ్లేందుకు గతేడాది అక్టోబర్‌లో జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో హైజాక్‌ డ్రామా ఆడిన బంగారం వ్యాపారి బిర్జూ కిషోర్‌ సల్లా(37)ను విమానాలు ఎక్కకుండా నిషేధిస్తూ ( నో ఫ్లై లిస్ట్‌) డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి సాధారణ పౌరుడిగా కిషోర్‌ సల్లా రికార్డు సృష్టించాడు. కానీ నిషేధం ఎంతకాలం అమల్లో ఉంటుందో డీజీసీఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు సూచన మేరకు ఆయన్ను నిషేధిత జాబితాలో చేర్చామని సంస్థ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌ 30న ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో హైజాకర్లు ఉన్నారు..ఢిల్లీలో విమానాన్ని ల్యాండ్‌ చేస్తే పేల్చేస్తామని కిషోర్‌ టాయిలెట్‌లో లెటర్‌ పెట్టాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement