no flying zone
-
తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు..
సాక్షి, తిరుపతి: తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. అయితే ఇవి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవని సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్లే సమయంలో తిరుమల మీది నుంచి ప్రయాణించినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కన్పించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదనే నిబంధన ఉంది. చదవండి: తిరుమలలో పాముల కలకలం -
ఉక్రెయిన్‌కు మరో షాక్.. జెలెన్ స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల ముప్పెట దాడి కొనసాగుతోంది. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలగాల ధాటికి ఆసుపత్రులు, పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నో-ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో -ఫ్లైజోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ.. అలా చేస్తే.. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్టు అవుతుందన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా కీవ్ నుంచి మాట్లాడుతూ.. తమ దేవంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్ను మరో సిరియాగా మార్చవద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమ ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు తమ భాగస్వామ దేశాల నుంచి సహాకారం అందాలని విజ్ఞప్తి చేశారు. -
‘నో ఫ్లై లిస్ట్’లో బంగారం వ్యాపారి
న్యూఢిల్లీ: ప్రియురాలిని ఉద్యోగం మాన్పించి.. తనతో పాటు తీసుకెళ్లేందుకు గతేడాది అక్టోబర్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానంలో హైజాక్ డ్రామా ఆడిన బంగారం వ్యాపారి బిర్జూ కిషోర్ సల్లా(37)ను విమానాలు ఎక్కకుండా నిషేధిస్తూ ( నో ఫ్లై లిస్ట్) డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి సాధారణ పౌరుడిగా కిషోర్ సల్లా రికార్డు సృష్టించాడు. కానీ నిషేధం ఎంతకాలం అమల్లో ఉంటుందో డీజీసీఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు ఆయన్ను నిషేధిత జాబితాలో చేర్చామని సంస్థ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 30న ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో హైజాకర్లు ఉన్నారు..ఢిల్లీలో విమానాన్ని ల్యాండ్ చేస్తే పేల్చేస్తామని కిషోర్ టాయిలెట్లో లెటర్ పెట్టాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేశారు. -
తిరుమలలో అపచారం
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ప్రధాన ఆలయంపైగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంపై విమానాలు తిరగటం ఆగమవిరుద్ధమని అర్చకులు పలుమార్లు సూచించినా అదే ధోరణి కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన విమానం