కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల ముప్పెట దాడి కొనసాగుతోంది. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలగాల ధాటికి ఆసుపత్రులు, పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు.
ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్‌లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నో-ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో -ఫ్లైజోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ.. అలా చేస్తే.. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్టు అవుతుందన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా కీవ్ నుంచి మాట్లాడుతూ.. తమ దేవంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను మరో సిరియాగా మార్చవద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమ ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు తమ భాగస్వామ దేశాల నుంచి సహాకారం అందాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment