న్యూఢిల్లీ : పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైజెస్(పీఈడీ)లను చెక్‌ఇన్ లగేజిలో ఉంచడంపై నిషేధం పడే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్స్ లాంటి వస్తువుల బ్యాటరీలు పేలితే గుర్తించే అవకాశాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఇండోర్ బయల్దేరిన విమానంలో పాసింజర్ సెల్‌ఫోన్ పేలడంతో క్యాబిన్ క్రూ ప్రమాదం నుంచి తప్పించారు.
ఇందుకోసం దేశీయ విమానయాన సంస్థలు క్యాబిన్ క్రూ ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. చెక్‌ఇన్ లగేజిలో పీఈడీలపై నిషేధానికి సంబంధించి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా, భారత్ కూడా అదే మార్గంలో నడవాలని భావిస్తోంది. భారత్‌లో ఇప్పటికే పవర్ బ్యాంక్స్, పొర్టబుల్ మొబైల్ చార్జర్స్, ఈ సిగరెట్స్‌ను చెక్ ఇన్ లగేజిలో ఉంచడం నిషేధించారు.
laptops, DGCA, Check-in luggage
Comments
Please login to add a commentAdd a comment