Laptop ban
-
చెక్ ఇన్‌లో ల్యాప్‌టాప్‌లపై నిషేధం..!
న్యూఢిల్లీ : పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైజెస్(పీఈడీ)లను చెక్ఇన్ లగేజిలో ఉంచడంపై నిషేధం పడే అవకాశం ఉంది. ల్యాప్టాప్స్ లాంటి వస్తువుల బ్యాటరీలు పేలితే గుర్తించే అవకాశాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఇండోర్ బయల్దేరిన విమానంలో పాసింజర్ సెల్‌ఫోన్ పేలడంతో క్యాబిన్ క్రూ ప్రమాదం నుంచి తప్పించారు. ఇందుకోసం దేశీయ విమానయాన సంస్థలు క్యాబిన్ క్రూ ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. చెక్ఇన్ లగేజిలో పీఈడీలపై నిషేధానికి సంబంధించి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా, భారత్ కూడా అదే మార్గంలో నడవాలని భావిస్తోంది. భారత్‌లో ఇప్పటికే పవర్ బ్యాంక్స్, పొర్టబుల్ మొబైల్ చార్జర్స్, ఈ సిగరెట్స్‌ను చెక్ ఇన్ లగేజిలో ఉంచడం నిషేధించారు. laptops, DGCA, Check-in luggage -
విమానాల్లో ల్యాప్‌టాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై కారణంగా అమెరికాలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని నిషేధం విధించారు. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. అవసరమైతే యూరోప్ ఎయిర్‌లైన్స్‌ను అమెరికాకు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి డేవిడ్ లాపన్ అన్నారు. యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. బుధవారం డిప్యూటీ సెక్రటరీ ఈలైన్ డ్యూక్ యూరోప్ సంబంధిత అధికారులతో బ్రస్సెల్స్‌లో సమావేశం కానున్నారు. సమ్మర్లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయని, ఆ సమయంలో సైబర్ వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని డేవిడ్ లాపన్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అందించిన నిఘా రహస్యాలు మరేవో కాదని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు పక్కా ప్రణాళికలతో ఉగ్రదాడులకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయని రష్యాతో చర్చించినట్లు పేర్కొన్నారు. -
నిషేధ ఎఫెక్ట్ : లాభాలు హుష్ కాకి
పారిస్ : అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం నిషేధాల మీద నిషేధాలు విధిస్తూ పలు వివాదాలకు తెరతీస్తుంది. కొన్ని దేశాల నుంచి అమెరికాకు విమానాల్లో వచ్చే ప్రయాణికులు తమవెంట ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి తీసుకురాకుండా ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో ప్రయాణికులకు తీవ్ర ఎఫెక్ట్ చూపనుంది. ఒక్క ప్రయాణికులకు మాత్రమే కాదు, ఇటు విమానయాన సంస్థలకు ఇది భారీ దెబ్బ కొట్టనుందట. భారీగా లాభాలు తగ్గిపోనున్నాయని, ముఖ్యంగా గల్ఫ్ క్యారియర్స్ బిజినెస్ క్లాస్ సెగ్మెంట్ల లాభదాయకత తగ్గిపోనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్, జోర్డాన్ లోని అమన్, కువైట్, ఈజిప్టు రాజధాని కైరో, మొరాకాలోని కసబ్లాంకా, ఖతార్ లోని దోహ, సౌదీలోని రియాద్, దుబాయి నుండి వచ్చే నాన్ స్టాప్ విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ వాషింగ్టన్ నిర్ణయం తీసుకుంది. ఇదే రకమైన ఆంక్షలను ఇటు బ్రిటన్ కూడా అమల్లోకి తేనున్నట్టు ప్రకటించింది. సెక్యురిటీ కారణాలతో విమానాల్లో ఎలక్ట్రిక్ వస్తువులపై నిషేధం విధిస్తున్నట్టు ఈ దేశాలు చెప్పాయి. కానీ ఇది విమానయాన సంస్థలకు షాకింగ్ న్యూసేనని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. అమెరికాకు ఈ మార్గాలగుండా ట్రావెల్ చేసే ప్రయాణికులు ఇక నుంచి వేరే విమానాలకు మరలుతారని పేర్కొన్నారు. ఒక్క ప్రయాణికులను కోల్పోవడమే కాకుండా... లగేజీపై ఎక్కువగా ఫోకస్ చేసి తనిఖీలు పెంచడం సంస్థల వ్యయాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అదనపు సమయం లగేజీ తనిఖీకే వాడటం ప్రయాణికుల్లో చిరాకును తెంపిస్తుందని వారు తెలిపారు. ఇవన్నీ విమానసంస్థలకు ప్రతికూలంగా మారి, లాభాలకు గండికొట్టనున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే బిజినెస్ వ్యక్తులు ఎక్కువగా ఆన్ బోర్డులోనే వర్క్ చేసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం వారికి ఈ అవకాశం లేకుండా పోతుంది.