నిషేధ ఎఫెక్ట్ : లాభాలు హుష్ కాకి
నిషేధ ఎఫెక్ట్ : లాభాలు హుష్ కాకి
Published Fri, Mar 24 2017 10:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
పారిస్ : అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం నిషేధాల మీద నిషేధాలు విధిస్తూ పలు వివాదాలకు తెరతీస్తుంది. కొన్ని దేశాల నుంచి అమెరికాకు విమానాల్లో వచ్చే ప్రయాణికులు తమవెంట ల్యాప్టాప్లు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి తీసుకురాకుండా ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో ప్రయాణికులకు తీవ్ర ఎఫెక్ట్ చూపనుంది. ఒక్క ప్రయాణికులకు మాత్రమే కాదు, ఇటు విమానయాన సంస్థలకు ఇది భారీ దెబ్బ కొట్టనుందట. భారీగా లాభాలు తగ్గిపోనున్నాయని, ముఖ్యంగా గల్ఫ్ క్యారియర్స్ బిజినెస్ క్లాస్ సెగ్మెంట్ల లాభదాయకత తగ్గిపోనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్, జోర్డాన్ లోని అమన్, కువైట్, ఈజిప్టు రాజధాని కైరో, మొరాకాలోని కసబ్లాంకా, ఖతార్ లోని దోహ, సౌదీలోని రియాద్, దుబాయి నుండి వచ్చే నాన్ స్టాప్ విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ వాషింగ్టన్ నిర్ణయం తీసుకుంది. ఇదే రకమైన ఆంక్షలను ఇటు బ్రిటన్ కూడా అమల్లోకి తేనున్నట్టు ప్రకటించింది. సెక్యురిటీ కారణాలతో విమానాల్లో ఎలక్ట్రిక్ వస్తువులపై నిషేధం విధిస్తున్నట్టు ఈ దేశాలు చెప్పాయి.
కానీ ఇది విమానయాన సంస్థలకు షాకింగ్ న్యూసేనని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. అమెరికాకు ఈ మార్గాలగుండా ట్రావెల్ చేసే ప్రయాణికులు ఇక నుంచి వేరే విమానాలకు మరలుతారని పేర్కొన్నారు. ఒక్క ప్రయాణికులను కోల్పోవడమే కాకుండా... లగేజీపై ఎక్కువగా ఫోకస్ చేసి తనిఖీలు పెంచడం సంస్థల వ్యయాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అదనపు సమయం లగేజీ తనిఖీకే వాడటం ప్రయాణికుల్లో చిరాకును తెంపిస్తుందని వారు తెలిపారు. ఇవన్నీ విమానసంస్థలకు ప్రతికూలంగా మారి, లాభాలకు గండికొట్టనున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే బిజినెస్ వ్యక్తులు ఎక్కువగా ఆన్ బోర్డులోనే వర్క్ చేసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం వారికి ఈ అవకాశం లేకుండా పోతుంది.
Advertisement
Advertisement