check in Baggage
-
అదనపు బ్యాగేజీపై ఇక ఛార్జీల బాదుడే
న్యూఢిల్లీ : దేశీయ విమానాల్లో 15 కేజీల కంటే అదనంగా చెక్-ఇన్ బ్యాగేజీ తీసుకెళ్తున్నారా? అయితే ఇక మీకు ఛార్జీల మోత మోగినట్టేనట. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌లు అదనపు బ్యాగేజీల ప్రీ-బుకింగ్ ఛార్జీలను, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెల్లించే అదనపు చెక్-ఇన్ బ్యాగేజీల ఛార్జీలను పెంచేశాయి. ఎయిర్‌పోర్టుల వద్ద 15 కేజీలకు మించి అదనపు బ్యాగేజీని తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపితే, ఒక్కో కిలోకు ప్రస్తుతం 400 రూపాలను ఛార్జ్ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇండిగో అదనపు బ్యాగేజీ ఛార్జీలను మూడో వంతు లేదా 33 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీ-బుకింగ్ చేసుకునేటప్పుడు దేశీయ ప్రయాణికులు ఉచితంగా అందించే 15 కేజీలను మించి మరో 5, 10, 15, 30 కేజీలను తీసుకెళ్తున్నట్టు నమోదు చేస్తే, ఇక నుంచి రూ.1900, రూ.3800, రూ.5700, రూ.11,400ను చెల్లించాల్సి ఉంటుంది. గత ఆగస్టులోనే ఇండిగో ఈ ఛార్జీలను పెంచింది. తాజాగా మరోసారి కూడా వీటిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక స్పైస్‌జెట్ సైతం 5, 10, 15, 20, 30 కేజీల అదనపు బ్యాగేజీకి విధించే ప్రీబుక్ ఛార్జీలను రూ.1600, రూ.3200, రూ.4800, రూ.6400, రూ.9600కు పెంచుతున్నట్టు తెలిపింది. ఎవరైతే ప్రీబుక్ చేసుకోరో వారు అదనపు చెక్-ఇన్ బ్యాగేజీకి ఒక్కో కిలోకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గోఎయిర్ అదనపు బ్యాగేజీ ఛార్జీలు అచ్చం ఇండిగో మాదిరిగానే ఉన్నాయి. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే 25 కేజీల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా అనుమతి ఇస్తోంది. గతేడాది ఆగస్టు వరకు ఎయిర్‌లైన్స్ అన్నీ 15 కేజీలకు మించి.. తొలి ఐదు కిలోల అదనపు బ్యాగేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎయిర్‌లైన్స్ నడుచుకునేవి. కానీ డీజీసీఏ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన ఎయిర్‌లైన్స్, 15 కేజీలకు మించిన తర్వాత విధించే అదనపు బ్యాగేజీ ఛార్జీలను అవి మాత్రమే నిర్ణయించుకునేలా ఆదేశాలను తెచ్చుకున్నాయి. -
చెక్ ఇన్‌లో ల్యాప్‌టాప్‌లపై నిషేధం..!
న్యూఢిల్లీ : పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైజెస్(పీఈడీ)లను చెక్ఇన్ లగేజిలో ఉంచడంపై నిషేధం పడే అవకాశం ఉంది. ల్యాప్టాప్స్ లాంటి వస్తువుల బ్యాటరీలు పేలితే గుర్తించే అవకాశాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఇండోర్ బయల్దేరిన విమానంలో పాసింజర్ సెల్‌ఫోన్ పేలడంతో క్యాబిన్ క్రూ ప్రమాదం నుంచి తప్పించారు. ఇందుకోసం దేశీయ విమానయాన సంస్థలు క్యాబిన్ క్రూ ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. చెక్ఇన్ లగేజిలో పీఈడీలపై నిషేధానికి సంబంధించి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా, భారత్ కూడా అదే మార్గంలో నడవాలని భావిస్తోంది. భారత్‌లో ఇప్పటికే పవర్ బ్యాంక్స్, పొర్టబుల్ మొబైల్ చార్జర్స్, ఈ సిగరెట్స్‌ను చెక్ ఇన్ లగేజిలో ఉంచడం నిషేధించారు. laptops, DGCA, Check-in luggage -
బరువు 15 కేజీలు దాటితే బాదుడే బాదుడు!
- చెకిన్ బ్యాగేజీ చార్జీలను పెంచనున్న స్పైస్‌జెట్ - డీజీసీఏ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడంతో ముందుకు.. న్యూఢిల్లీ: తక్కువ ధరలకే విమానయాన సేవలు అందిస్తోన్న స్పైస్‌జెట్ సంస్థ ఇక.. చెకిన్ బ్యాగేజీపై భారీ రుసుము వసూలుచేయనున్నట్లు తెలిసింది. విమానాల్లో చెకిన్ లగేజీ బరువు 15 కేజీలు దాటితే.. ఒక్కో అదనపు కేజీకి రూ.300 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రైవేటు విమానయాన సంస్థల చెకిన్ బ్యాగేజీ చార్జిలను నియంత్రిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఒక్కో విమాన ప్రయాణికుడు 15 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆపై ఒక్కో కేజీపై రూ.100 మాత్రమే అదనంగా తీసుకోవాలని పేర్కొంది. తమకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్(ఎఫ్ఐఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విధించే చార్జీలను నియంత్రించే అధికారం డీజీసీఏకు లేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సమగ్ర విచారణ అనంతరం డీజీసీఏ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రైవేట్ సంస్థలు బ్యాగేజీలపై చార్జీలు పెంచేందుకు ఆటంకాలు తొలిగిపోయినట్లయింది. అందరికంటే ముందు స్పైస్ అదనపు చార్జీలను ప్రకటించే వీలుంది. ఇక ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మాత్రమే 23 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లేవీలుంది. -
ఇక విమానాల్లో బ్యాగేజ్ బాదుడు
జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లకు డీజీసీఏ అనుమతి న్యూఢిల్లీ: జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లు ప్రకటించేందుకు దేశీ విమానయాన సంస్థలకు ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ అనుమతినిచ్చింది. ఒకవేళ ఇలాంటి ఆఫర్లో టికెట్ పొందినవారు ప్రయాణ సమయంలో చెకిన్ బ్యాగేజ్‌తో వచ్చిన పక్షంలో నిర్దేశిత జరిమానా వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెకిన్ బ్యాగేజ్ ఉండని ప్రయాణికులకు.. డిస్కౌంట్లు ఇచ్చేలా జీరో బ్యాగేజ్ ఆఫర్లకు అనుమతించాలంటూ ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఏషియా ఇండియా సంస్థలు గతంలోనే కోరినప్పటికీ తిరస్కరించిన డీజీసీఏ తాజాగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పరిశ్రమలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా డీజీసీఏ నిర్ణయం ఉందంటూ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిరిండియా 23 కేజీల దాకా, చాలామటుకు దేశీ ప్రైవేట్ విమానయాన సంస్థలు 15 కేజీల దాకా చెకిన్ బ్యాగేజ్కు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. తాజా పరిణామంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆఫర్లలో టికెట్లను విక్రయించినప్పుడు ఇటువంటి ఉచిత చెకిన్ బ్యాగేజ్కు కూడా చార్జీలు వసూలు చేసుకునే వీలు లభిస్తుంది. ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ లాంజ్‌ల వినియోగం నుంచి ప్రయాణికులు కోరుకునే నిర్దిష్ట సీటు కేటాయింపు దాకా వివిధ సర్వీసులకు ఎయిర్‌లైన్స్ అదనంగా వసూలు చేసుకునేందుకు డీజీసీఏ ఇప్పటికే అనుమతించింది. చెకిన్ బ్యాగేజ్ లేకుండా కేవలం హ్యాండ్బ్యాగ్తోనే ప్రయాణించే వారికి రూ. 200 డిస్కౌంటు ఇచ్చేటువంటి ఆఫర్‌ను స్పైస్‌జెట్ గతంలోనే ప్రకటించింది. డిస్కౌంటు రేట్లకు టికెట్ తీసుకున్నవారు తర్వాత చెకిన్ బ్యాగేజ్తోగనుక వస్తే... 10 కేజీల దాకా బరువున్న వాటిపై రూ. 500, 15 కేజీల బరువున్న వాటిపై రూ. 750 చార్జీలు కట్టాల్సి ఉంటుందంటూ షరతు పెట్టింది.