న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరీ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని ఎదుర్కోవడానికి మరో ఔషధ వినియోగానికి తాజాగా అనుమతి లభించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉండే కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ల చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ విరాఫిన్‌ను ఉపయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగనికి అనుమతి లభించినట్లు జైడస్ కాడిలా ప్రకటించింది. తక్కువ స్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు.
ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో 20-25 కేంద్రాలలో నిర్వహించిన మల్టీసెంట్రిక్ ట్రయల్ లో విరాఫిన్ కోవిడ్-19 చికిత్సలో ప్రధాన సవాళ్లలో ఒకటైన శ్వాసకోశ బాధలను, వైఫల్యాన్ని విరాఫిన్ నియంత్రించగలిగిందని ఇతర సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఏమి రాలేదని కంపెనీ పేర్కొంది. దేశంలో ఒకే రోజులో 3.32 లక్షల కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కు చేరుకోగా, క్రియాశీల కేసులు 24 లక్షలను దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment