ఎయిర్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్ 6న ప్యారిస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది.
కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం.
(చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ)
Comments
Please login to add a commentAdd a comment