pee
-
మూత్ర విసర్జన ఘటన: గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్‌లోని సిధి గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించిన పోలీసులు.. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దశమత్ రావత్‌ను సీఎం గురువారం భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్ సింగ్ చౌహన్. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత.. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందన్నారు.ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనలో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని సీఎం వెల్లడించారు. मेरे संज्ञान में सीधी जिले का एक वायरल वीडियो आया है... मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023 మరోవైపు నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీకి చెందినవాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ దళిత, గిరిజన ద్వేషానికి ఈ ఉదంతం అద్దం పడుతోందని కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా దుయ్యబట్టారు. బీజేపీ హయాంలో వారిపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయని రాహుల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. దీనిపై విచారణకు నలుగురు వ్యక్తుల కమిటీ వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించడం విశేషం. ఈ చర్య హీనమైనదని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. #WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat. CM tells him, "...I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP — ANI (@ANI) July 6, 2023 -
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
చేదు అనుభవం.. బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన
సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఈ దారుణం జరిగింది. మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది. డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది. -
అదే తరహాలో రెండో ఘటన: ఎయిర్ ఇండియాకి మరోసారి షాక్
ఎయిర్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్ 6న ప్యారిస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
Air India Urination Case: వెలుగులోకి కీలక ఈమెయిల్స్
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్‌లైన్ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రశ్నించగా ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్ ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తోసహా ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సూపర్వైజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్(ఐఎఫ్‌సీడీ), హెచ్ఆర్ హెడ్‌కి ఈమెయిల్ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్ కేర్ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్ చర్చల అనంతరం ఈమెయిల్స్ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్ విభాగం ఇన్‌ఫ్లైట్ సర్వీస్ హెడ్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్ అందుకున్న విల్సన్ కస్టమర్ కేర్ ఆ మెయిల్స్ ఫార్వర్డ్ చేసి తనకు వచ్చిన మెయిల్స్‌పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మేనేజింగ్ డ్రైరెక్టర్(సీఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ..ఎయిర్‌లైన్ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్ నిందితుడు శంకర్ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్‌గా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నిష్క్రమించినట్లు తేలింది. ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్ ఇండియా చైర్మన్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ విమానయాన సంస్థ మరియు దాని చీఫ్‌లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెన్షన్ తోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ ఇన్‌ఫ్లైట్ సర్వీస్‌కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
Urination Case: ఎయిరిండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).. ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు రూ.3 లక్షల ఫైన్ విధించింది. ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్ అరెస్ట్ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్‌కు నిరాకరించింది కోర్టు. -
Air India pee-gate: ఇంతకు ఇంత అనుభవిస్తావు!
న్యూఢిల్లీ: న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పటియాలా కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని శంకర్ మిశ్రా ఆరోపించాడు. తనకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, సాక్ష్యులను ప్రభావితం చేసే స్థాయిలో లేనని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు. అయితే.. కేసు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పైగా ఓ మహిళ పట్ల నిందితుడు వ్యవహరించిన తీరు ఏమాత్రం సహించరానిదని తెలిపింది. అంతకు ముందు శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ.. శంకర్ మిశ్రా లైంగిక కోరికలతోనో లేదంటే ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాలనో అలా ప్రవర్తించలేదని వాదించాడు. అయితే.. బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌ను బెదిరించారనే విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి తండ్రి.. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపించాడని, చేసినదానికి ఇంతకు ఇంత అనుభవిస్తావు అంటూ మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేశాడని, పైగా నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించే యత్నం కూడా చేశారని తెలిపారు. దీంతో బెయిల్‌ను నిరాకరించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోమల్ గార్గ్.. శంకర్ మిశ్రాకు బెయిల్ నిరాకరించారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు పోలీసులు శంకర్ మిశ్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించకుండా జ్యూడీషియల్ కస్టడీ విధించింది. -
‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు. నిందితుడి అరెస్ట్.. ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ -
అలా చేసి ఉండాల్సింది కాదు: మిశ్రా పక్క సీటు వైద్యుడు షాకింగ్ వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా పక్కసీటు ప్రయాణికుడు చాలా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు మిశ్రా పక్కసీటు వ్యక్తి ఆమెరికాకు చెందిన ఆడియాలజీ వైద్యుడు సుగతా భట్టాచార్జీ నాటి దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ...ఆ రోజు ఆ వృద్ధ మహిళ పట్ల పైలెట్ అలా వ్యవహరించి ఉండకూడదన్నారు. ఆయన ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధితురాలికి ఉపశమనం కలిగించేలా ఏదైనా చేసి ఉంటే ఇంతలా చర్చనీయాంశంగా మారేది కాదన్నారు. ఐతే నిందితుడి తండ్రి ఆ రోజు ఎలాంటి అనుచిత ఘటన జరగలేదంటూ.. వాదించిన నేపథ్యంలోనే సుగతా భట్టాచార్జీ నాటి ఘటన గురించి వివరించారు. ఆ రోజు బాధిత మహిళ చాలా మర్యాదగా వ్యవహరించిందన్నారు. తాను బిజినెస్ క్లాస్‌లో 8A సీటులో కూర్చొన్నాని, మిశ్రా 8Cలో కూర్చొన్నారని చెప్పారు. ఆ రోజు భోజనం చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆరిపోయాయని చెప్పారు. ఆ తర్వాత నిందితుడు శంకర్ మిశ్రా వృద్ధురాలి సీటు9A వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. వాస్తవానికి వాష్ రూమ్ అతని సీటుకి నాలుగు సీట్ల వెనకాల ఉంది. ఈ హఠాత్పరిణామానికి 9A, 9Cలలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు ఇబ్బంది పడటం చూశానని అన్నారు. భట్టాచార్జీ తాను ఆ సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. మిశ్రా తనపై తూలితే.. ఫ్లైట్ వేగంగా వెళ్లడంతో అలా పడ్డాడనుకున్నాం, గానీ ఆ తర్వాత అతను చాలా మత్తులో ఉన్నట్లు గమనించి షాక్ అయ్యాం అన్నారు. పాపం ఆ బాధిత మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా..వారు వచ్చి కేవలం సీటును క్లీన్ చేసి, షీట్లు మార్చి.. మళ్లీ అక్కడే కూర్చొమన్నారని చెప్పుకొచ్చారు. దీంతో తనకు తన నైతిక బాధ్యత గుర్తుకొచ్చి..మరోక సీటు ఇవ్వాల్సిందిగా సీనియర్ హోస్ట్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఐతే ఆమె పైలెట్ అనుమతి తీసుకోవాలని, తాను అలా చేయాలనని చెప్పినట్లు తెలిపారు. ఆ రోజు ఆ సీటు క్లీన్ చేసేంత వరకు రెండు గంటల పాటు ఆ మహిళ అలా నిలబడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్లి సిబ్బందితో చెప్పడంతో ఆమెకు ఒక సిబ్బంది సీటును కేటాయించారు. ఆ రోజు బిజినెస్ క్లాస్‌లో సీటులు ఖాళీగా ఉన్నా కూడా పైలెట్ ఆమెకు మరో సీటు కేటాయించకపోగా..కాసేపటి తర్వాత అదే సీటుకి రావాల్సిందిగా కోరారు. ఐతే ఆమె అందుకు నిరాకరించి..సిబ్బందికి కేటాయించే.. చిన్న సీటులోనే ఉండిపోయిందని చెప్పారు. ఆ సమయంలో పైలెట్ సరైన రీతిలో నిర్ణయం తీసుకుని స్పందించి ఉంటే... ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. విమాన సిబ్బంది ఒక స్త్రీ పరువుతో ఆడుకుని, ఎయిర్ ఇండియా పరువు దిగజార్చరన్నారు. ఇదిలా ఉండగా, ముంబై సమీపంలోని బొయిన్‌సర్‌లో ఉంటున్న నిందితుడు మిశ్రా తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని, తన తల్లి వయసు ఉన్న ఆమెతో అలా వ్యవహరించడంటూ వాదించడం గమనార్హం. కాగా నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అంతేగాదు అతని కస్టడీ కోసం పోలీసుల చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. పైగా బెయిల్ దరఖాస్తును జనవరి 11న పరిశీలిస్తామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం ..
న్యూడిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణం మరవకముందే అదే ఎయిర్ ఇండియా విమానంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. పారిస్- ఢిల్లీ విమానంలో తాగిన మత్తులో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విజర్జన చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన డిసెంబర్ 6న ఎయిర్ ఇండియా విమానం 142లో చోటుచేసుకుంది. విమానం ఉదయం 9.40 గంటలకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వడంతో ఈ విషయంపై పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉండటం వల్ల క్యాబిన్ సిబ్బంది సూచలను పాటించలేదని అతడు పేర్కొన్నారు. అనంతరం అతను తోటి మహిళా ప్యాసింజర్ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. విమానం దిగిన వెంటనే ఈ నీచానికి పాల్పడిన వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అసభ్య ప్రవర్తనపై ప్రయాణికుడు రాతపూర్వక క్షమాపణ తెలిపాడు. దీంతో ఇద్దరుప్రయాణికులు పరస్పర రాజీ కుదుర్చుకోవడంతో అతనిపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు అమెరికాలోని న్యూయర్క్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు.. సీట్లో కూర్చున్న ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానంలో తనకు జరిగిన అవమానంపై బాధితురాలు ఎయిర్ ఇండియా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అధికారులు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వృద్ధుడిపై కేసు నమోదయ్యింది. అయితే విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టుకోకుండా వదిలేశారని బాధితురాలు ఆరోపించింది. ఆమెకు న్యాయం చేకూర్చేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా నుంచి పూర్తి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిందితుడి కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారుల బుధవారం తెలియజేశారు. -
ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు
కొలరాడో : సంతోషంలో మునిగినా, బాధలో ఉన్నా వాటిని మరిచిపోవాలంటే గొంతులో ‘చుక్క’ పడాల్సిందే. అందులోనూ బీర్లు తాగేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దిక్కు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైన్ షాపుల ముందు మందుబాబుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలో ఏ దేశంలో చూసిన వారి హడావిడి మాత్రం మాములుగా ఉండదు. లాక్డౌన్ సమయం కావడంతో మందు కోసం వెంపర్లాడుతున్న మందుబాబులు ఈ వార్త చదివితే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కలుస్తుందన్న వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. (ఇంటర్వ్యూలో అడ్డొచ్చిన కూతురు: పేరేంటమ్మా?) ప్రపంచవ్యాప్తంగా బీర్ల తయారీలో ప్రసిద్ధి పొందిన బడ్వైజర్ బ్రాండ్‌కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆ ప్లాంట్‌లో పని చేస్తున్న వాల్టర్ పావెల్( పేరు మార్చారు) అనే వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు పెద్ద బాంబునే పేల్చాడు. ఈ విషయంపై వాల్టర్‌ను నిలదీయగా అతనిచ్చిన సమాధానం వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ' జాయిన్ అయిన మొదటి రెండు సంవత్సరాలు ట్యాంకు కింది భాగంలో నీళ్లు కలిపే పని చేసేవాడిని. ప్లాంట్‌లో సీనియర్లతో పరిచయం పెరిగిన తర్వాత పైభాగంలో పని చేసే అవకాశం లభించింది. బీర్ ట్యాంకులో మూత్రం ఎందుకు పోశావని నిలదీస్తే మాత్రం నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఆ పని ఎందుకు చేశానో నాకే తెలీదు. బేసిగ్గా నాకు బద్ధకం ఎక్కువ. వాష్ రూమ్ కోసం అంత దూరం వెళ్లాలా? అనిపించేది, ప్రకృతి ఎప్పుడు పిలిచినా ట్యాంకులోనే పని కానిచ్చేవాడిని. ఒక్కోసారి మా ఇంటివాళ్లు బీర్ తెమ్మన్నప్పుడు చాలా భయపడిపోయేవాడిని. అయినా కొలరాడోలోని ఫోర్ట్ కొలిన్స్ ప్లాంట్‌లో మాత్రమే ఈ పని చేశాను' అంటూ సమాధానమిచ్చాడు. ' పైగా ఈ విషయం ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట నేను అలా చేయను.. ఇప్పటినుంచి బడ్వైజర్ ప్రియులు నాణ్యమైన బీర్‌ను పొందుతారు ' అంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించకపోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బడ్వైజర్ కంపెనీలో 12 ఏళ్లుగా ఒక వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలిగాయి. ఆ వ్యక్తి చెప్పిందంతా నిజమేనా.. కాదా.. అనేది తెలుసుకోవడానికి ఒక సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. వీరి అధ్యయనంలో ఇదంతా నిజం కాదని, ఫూలిష్ హ్యూమర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ సంస్థ సరదాగా క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అని తేలింది. కానీ వారు రాసిన ఈ వార్త మాత్రం బీరు ప్రియుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషయంపై బడ్వైజర్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. చదవండి: టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా -
వెరైటీ నిరసన.. కుక్కలకు మాత్రమే
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. పదవిలోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర గడిచినా ఇంకా ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గలేదు. ఈ క్రమంలో ట్రంప్‌పై తనకున్న అసహ్యాన్ని తెలియజేయాడానికి ఓ వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నాడు న్యూయార్క్‌కు చెందిన ‘పోర్క్యపైన్ అర్మడిల్లా’ అనే వీడియో కంపెనీ యజమాని ఫిల్ గాబ్లే. డొనాల్డ్ ట్రంప్ విగ్రహాలు తయారు చేయించి, వాటి మీద ‘పీ ఆన్ మీ’(నా మీద మూత్ర విసర్జన చేయండి) అని రాయించాడు ఫిల్ గాబ్లే. ఈ విగ్రహాలను న్యూయార్క్‌లోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించాడు. ఈ విషయం గురించి గాబ్లే ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ట్రంప్ అధ్యక్షుడిగా కాదు కదా కనీసం మనిషిగా కూడా పనికిరాడు. అతని మీద నా వ్యతిరేకతను తెలియజేయడం కోసం ఇలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాను’ అని తెలిపాడు. అంతేకాక ‘ఈ స్యాట్యూలను న్యూయార్క్ పట్టణంలోని ఐదు ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేశాను. అయితే ఇక్కడ కేవలం కుక్కలు మాత్రమే మూత్ర విసర్జన చేయాలి. నా వరకూ ఇది హస్యంతో కూడిన వ్యంగ్యం’ అని వెల్లడించాడు. -
మంత్రి బహిరంగ మూత్ర విసర్జన వీడియో
-
మంత్రి వీడియోపై పెనుదుమారం
సాక్షి, ముంబై : బహిరంగ మల, మూత్ర విసర్జనకు వ్యతిరేక ఉద్యమాన్ని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా చేసి మరీ మోదీ సర్కార్ మూడేళ్లుగా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకే చెందిన ఓ నేత చేసిన పని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర మంత్రి రామ్ షిండే.. సోలాపూర్-బర్షీ రహదారిపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వీడియో అది. కాన్వాయ్‌ను పక్కన ఆపించి మరీ పక్కనే పొదల్లోకి వెళ్లి ఆయన పని కానిచ్చేశాడు. ఆ వీడియో మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘‘ఓ మంత్రి ఇలా రోడ్డు పక్కనే స్వచ్ఛ్ భారత్‌కు తూట్లు పొడిచేశాడు. అంటే మోదీ పిలుపు ఘోరంగా వైఫల్యం చెందినట్లే’’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అంటున్నారు. సొంత మంత్రులే ఆయన చెప్పే నీతిపాఠాలను పాటించనప్పుడు ఇంక జనాల నుంచి దానిని ఆశించటం కరెక్ట్ కాదు. స్వచ్ఛ్ భారత్ కేవలం ప్రజలను కొల్లగొట్టేందుకే ప్రచారం చేస్తున్నారు అని బీజేపీపై మాలిక్ మండిపడ్డారు. మంత్రి వివరణ... ఇక ఈ వీడియోపై మంత్రి రామ్ షిండే స్పందించారు. ‘‘జలయుక్త శివార్ పథకం సమీక్ష కింద నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టా. ప్రయాణాలు.. వాతావరణంలోని మార్పులతో ఆరోగ్యం క్షీణించింది. గత రెండు రోజుల నుంచి జ్వరంగా కూడా ఉంది. రోడ్డు మీద వస్తున్న సమయంలో నాకు మరుగుదొడ్లు కనిపించలేదు. అందుకే రోడ్డు పక్కనే విసర్జించా’’ అని షిండే ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అయితే షిండే ప్రకటనపై శాంతించని ప్రతిపక్షాలు ఆయన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. -
ఇక్కడ మూత్రం చేస్తే ఇక అంతే...
శాన్ఫ్రాన్సిస్కో: ఎక్కడ గోడ కనపడితే అక్కడ లఘుశంక తీర్చుకునే మగ మహారాజులకు ఇప్పుడు చుక్కెదురైనట్టే. ఏం.. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. త్రీ ఇడియట్స్ సినిమాలో సీనియర్ మూత్రం పోస్తానంటే స్పూను పెట్టి, దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చే సీన్ చూసే ఉంటారు కదూ. ఇంతవరకు మనం గోడకు కొట్టిన బంతి గురించి విన్నాం.. చూశాం.. ఇది పాతదే. కానీ ఇపుడు గోడక్కొట్టిన సు.. స్సూ.. అంతే వేగంగా తిరిగి మొఖం మీద పడటం ఖాయమట. ఇది కొత్త విషయం. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి.. నగరాన్ని మురికికూపంగా మారుస్తున్న వైఖరికి స్వస్తి చెప్పేందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని అధికారులు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నగరంలోని బార్లు, హోటెళ్లు, బస్లాండ్లు తదితర ఏరియాల్లో గోడలకు ఒక పెయింట్ వేశారు. దాంతో పాటు ఒక స్లోగన్‌ను కూడా జత చేర్చారు. 'ఆగండి.. ఇక్కడ కాదు... దాని కోసం వేరే చోటు వెదుక్కోండి.. లేదంటే మీ మూత్రం మీ మొఖం మీదికే' అని బోర్డులు తగిలించేశారు. అల్ట్రా ఎవర్ డ్రై గా పిలిచే ఈ పెయింట్ వేసిన గోడలపై నీళ్లు, లేదా ఏదైనా ద్రవపదార్థం పడితే, అది అంతే వేగంగా వెనక్కి వెదజల్లుతుంది. ఈ పెయింట్‌కు సూపర్ హైడ్రోఫోబిక్ (నీటిని వికర్షించే శక్తి) గుణం ఉండడం వల్ల ఎవరైనా మూత్రం చేస్తే ఆ మూత్రం తిరిగి వారిమీదే పడుతుందని అధికారులు వెల్లడించారు. సిమెంట్ కంపెనీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ పెయింటును తయారు చేసిందని సమాచారం. ఇటీవల జర్మనీ అనుసరించిన ఈ విధానం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జర్మనీలోని హాంబర్గ్ వాసులు సెయింట్ పాలి నైట్‌క్లబ్ ప్రాంతంలో ఆచరించిన ఈ పద్ధతికి ఎట్రాక్ట్ అయ్యారు. వెంటనే తమ నగరంలోని పలు గోడలకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ పెయింట్లు వేయించారట. దీంతో తమ ప్రాంతంలో కూడా ఈ పెయింట్లు వేయించండి బాబూ అని నగర వాసుల నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయట. ఇలాంటి అవకాశం మనకు కూడా వస్తే.. గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ పటాలు దర్శనం ఇవ్వకుండా ఉంటాయి. -
మూత్రానికి రూపాయి!
అహ్మదాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను నివారించడానికి అహమ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక ఐడియా వచ్చింది. అదే 'రూపీ ఫర్ పీ' స్కీం. గురువారం నుంచి ఈ పథకాన్ని దీన్ని అమలు చేసేందుకు సర్వం సిద్దం చేశారు. ఇక్కడ మూత్రం చెయ్యి.. రూపాయి కొట్టు అనే నినాదంతో నగరంలో అనేకచోట్ల కాంప్లెక్స్‌లు వెలిశాయి. దాదాపు 67 సెంటర్లలో వీటిని నిర్వహిస్తున్నారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందకు ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. నగరంలో దాదాపు 300 పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యం ఉన్నా, బహిరంగ మూత్ర విసర్జన వల్ల నగరంలో 67 ప్రాంతాల్లోని పరిసరాలు దుర్గంధంగా, చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయని స్టాండింగ్ కమిషన్ ఛైర్మన్ ప్రవీణ్ పటేల్ తెలిపారు. అందుకే ప్రజల ఆరోగ్యం సంరక్షణార్థం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేశామనన్నారు. ప్రస్తుతానికి 67 సెంటర్లలో మాత్రమే మూత్రానికి రూపాయి స్కీమ్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని మున్సిపల్ సీనియర్ అధికారి తెలిపారు. చాలా వరకు స్లమ్ ఏరియాల్లో తమ స్కీమును ప్రవేశపెట్టామన్నారు. అందరూ విధిగా పబ్లిక్ టాయిలెట్‌ను వినియోగించాలన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు, జరిమానా విధిస్తామన్నారు. వ్యాపార ప్రకటనల ద్వారా దీనికి సంబంధించిన వనరులను సమకూర్చుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి పథకాన్ని నేపాల్ రాజధాని కఠ్మండులో విజయవంతంగా అమలు చేసినట్టు సమాచారం. అక్కడ దారేచౌక్ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఈ స్కీమును జనం బాగా వాడుకున్నారట. కాగా ఏఎంసీ ప్రవేశపెట్టిన ఈ స్కీము సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
'ఆ చిన్న పని మీ ఊళ్లోనే చేసుకొండి'
ఓ బుడ్డోడు రోడ్డు మీద చిన్న పని కానిచ్చాడు. మనకైతే ఇది చాలా మామూలు విషయం. చెడ్డీ పైకి లాగి 'గుడ్ బాయ్... బట్టలు ఖరాబు చేసుకోలేదు. చెప్పి రోడ్డు మీద పని చేశావు... ' అని మెచ్చుకుంటాం కూడా. కానీ హాంకాంగ్ లో ఇప్పుడీ చిన్న పనే పెద్ద వివాదానికి దారి తీస్తోంది. హాంకాంగ్ ఈ మధ్యే చైనాలో కలిసింది. అక్కడ ఇలాంటివి నిషిద్ధం. కానీ చైనాలో మాత్రం చిన్న పిల్లల వరకూ ఇది ఓకే. దాంతో హాంకాంగ్ ప్రజలు చైనా మెయిన్‌లాండ్ ప్రజలను వేళాకోళం చేస్తున్నారు. ఇదిగో... ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోయే ప్రస్తుతం వివాదానికి కారణం. మెయిన్ లాండ్ చైనా ప్రజలు వచ్చి హాంకాంగ్ ను ఖరాబు చేస్తున్నారంటూ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఓ పాపులర్ షాపింగ్ సెంటర్ అయితే ఏకంగా రోడ్డుపై చిన్న, పెద్ద పనులు చేస్తున్న మెయిన్ లాండ్ ప్రజల ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించేసింది. దీనిలో ఏకంగా 800 మంది పాల్గొన్నారు. మెయిన్ లాండర్లు మాత్రం దీనిపై భగ్గుమంటున్నారు. 'చిన్న పిల్లలకు ఏం తెలుసు. బ్లాడర్ బద్దలైపోతుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు?' అని వారు సర్దిచెబుతున్నారు. 'దయచేసి వాష్ రూమ్ లు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలిసేలా కొంచెం ఎక్కువ సైన్ బోర్డులు పెట్టండి మహాప్రభో' అంటూ మెయిన్ లాండర్లు వేడుకుంటున్నారు. అయితే 'అంత మంది చూస్తూండగా పిల్లలతో ఆ పని చేయించడం సరైన పనేనా?' అంటూ హాంకాంగ్ నివాసులు ఆక్షేపిస్తున్నారు. మొత్తం మీద చిన్నోడు చేసిన చిన్న పని పెద్దోళ్ల మధ్య పెద్ద వివాదమై, ఆఖరికి జాతీయస్థాయి కాంట్రవర్సీ గా మారి, అంతర్జాతీయ మీడియా వరకూ పాకేసింది. అదే మనదగ్గరైతేనా....?