
సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఈ దారుణం జరిగింది.
మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది.
డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది.
Comments
Please login to add a commentAdd a comment