woman passenger
-
Video Viral: మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్ దాడి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ బస్ కండక్టర్.. ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళపై చేయిచేసుకున్నాడు. ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ రంగంలోకి దిగింది. సదరు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. వివరాలు.. కొత్తనూర్ డిపోకు చెందిన బీఎమ్‌టీసీ బస్సులో మంగళవారం ఓ మహిళ ప్రయాణించింది. బస్సు బిలేకహళ్లి నుంచి శివాజీనగర్ వెళ్తోంది. టికెట్ తీసుకునే విషయంలో కండక్టర్ హోన్నప్ప నాగప్ప అగసర్కు మహిళా ప్రయాణికురాలికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మొదట మహిళ కండక్టర్‌పై చేయి చేసుకోగా.. అనంతరం కండక్టర్ ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దానిని బస్‌లోని మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వేరే రాష్ట్రానికి చెందిన మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది.. టికెట్ తీసుకునే విషయంలో బస్ కండక్టర్‌తో వాగ్వివాదం జరిగింది. ఆ వాదన పెరిగి పెద్దదైంది.. ఈ క్రమంలో కండక్టర్ ఆమెపై దాడి చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కండక్టర్ హొన్నప్ప నాగప్ప అగసర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాం. తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని పేర్కొంది. మరోవైపు కండక్టర్పైఓ మహిళా ప్రయాణికురాలు సిద్దాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. Bengaluru: Woman slaps bus conductor and he hits back. pic.twitter.com/RAQHV0yJlR — Pagan 🚩 (@paganhindu) March 27, 2024 -
Kolkata: విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. ‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. ఇదీచదవండి.. రాష్ట్ర హోదా కోసం లడఖ్‌లో నిరసనలు -
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళలు, కళాశాల విద్యారినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్‌కు తన సమస్యల గురించి వివరించింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్ గుర్తు చేశారు. అలాగే మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కూడా ప్రస్తావించారు. Shri @RahulGandhi hops on to a BMTC bus & interacts with women passengers to understand their vision for Karnataka. They candidly discuss topics including the rising price of essentials, Gruhalakshmi scheme and the Congress' guarantee of free travel for women in BMTC and KSRTC… pic.twitter.com/wqXySTY6Qw — Congress (@INCIndia) May 8, 2023 రాహుల్ బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన వీడియోను కాంగ్రెస్ యూత్ విభంగా ఎన్ఎస్యూఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బెంగళురు విజన్ గురించి కర్ణాటక మహిళలలు ఏమనుకుంటున్నారో రాహుల్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రచారం చివరిరోజున రాహుల్ తీరిక లేకుండా గడపనున్నారు. కాంగ్రెస్ నిర్వహించే పలు ర్యాలీలకు హాజరుకానున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు ప్రీపోల్ సర్వేలు తెలిపాయి. బీజేపీ మాత్రం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు -
Video: యువతితో రైల్వే టీసీ అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..
బస్సు, రైలు, విమానం.. ఇలా ప్రతి చోట ప్రయాణికులకు భద్రత కరువవుతోంది. ప్రయాణిస్తున్న వారితో అనుచితంగా ప్రవర్తించడం, మూత్ర విసర్జన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ బెదిరింపు ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న రైల్వే టికెట్ కలెక్టర్.. మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఉదంతం కర్ణాటకలో చోటుచేసుకుంది. కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లోని టికెట్ కలెక్టర్.. అక్కడే నిలబడి ఉన్న మహిళా ప్రయాణికురాలి వద్దకు వచ్చి టికెట్ చూపించాలని అడిగాడు. అయితే ఆ సమయంలో టీసీ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. యువతి తన ఫోన్లో టికెట్ కోసం వెతుకుతుండగా.. ఆమె టికెట్ లేకుండా రైలు ఎక్కిందని టీసీ ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టేషన్లో జరుగుతున్న తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోనల్లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో.. నన్ను ఎందుకు వేధిస్తున్నారు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నానంటూ యువతి టీసీతో గట్టిగా అరవడం కనిపిస్తోంది. దీనిపై టీసీ స్పందిస్తూ.. టికెట్ చూపించి వెళ్లు.. ఇది నా పని అంటూ హిందీలో చెప్పడం చూడవచ్చు. చదవండి: ‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ కాగా తాను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నానని, దానిని వేరే టిక్కెట్ కలెక్టర్‌కి చూపించానని యువతి పేర్కొంది. అయినా టీసీ తనపై దుర్భాషలాడుతూ.. తాకేందుకు ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. తనతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అతన్ని ప్రశ్నించింది. స్టేషన్లో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటున్న టీసీని.. యువతి దగ్గరికి లాక్కొచ్చారు. చివరికి ఈ విషయం రైలే శాఖ వరకు చేరడంతో టీటీఈని నైరుతి రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. Drunk TT pulled her at KJM . While the girl was telling she had her ticket, showed ticket to TT but TT didn't listen anything,pulled her and still misbehave with her.We need explanation for on duty drunk TT.@RailMinIndia@Central_Railway please take strict action against the TT. pic.twitter.com/UUjRcm8X1w — Karishma behera (@karishma_behera) March 14, 2023 -
చేదు అనుభవం.. బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన
సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఈ దారుణం జరిగింది. మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది. డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది. -
ప్యాసింజర్ దిగుతుండగా కదిలిన బస్.. ‘ఆర్టీసీ’కి రూ.1.30లక్షల ఫైన్
బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్‌ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది. 2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్ఆర్టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్‌ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్టీసీ అధికారులు సైతం వాధించారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి -
తనిఖీ పేరుతో దుస్తులు విప్పమని బలవంతం చేశారు.. అవమానించారు1
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో చాలా మది ప్రముఖులు సిబ్బంది తనిఖీల దృష్ట్యా ఈ మధ్య కాలంలో పలు చేదు అనుభవాలను చూసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్ తన కృత్రిమ అవయవాన్ని తొలగించమని ముంబై విమానాశ్రయంలో సిబ్బంది కోరినప్పుడు తాను చాలా అవమానానికి గురైయ్యానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పైగా మాలాంటి వాళ్ల పట్ల ఇలా ప్రవర్తించవద్దని ఎయిర్ పోర్ట్ సిబ్బందిని కోరారు కూడా. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది సుధా చంద్రన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పడు అచ్చం అలాంటి చేదు అనుభవమే 80 ఏళ్ల దివ్యాంగురాలికి ఎదురైంది. ఈ ఘటన గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 80 ఏళ్ల దివ్యాంగురాలు తన మనవరాలలితో కలిసి వచ్చింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణిలను తనిఖీ చేయడం సహజం అదే విధంగా వారిని ఆ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయితే సదరు మహిళ తుంటి ఎముక(హిప్ ఇపంప్లాంట్)కు సర్జరీ చేయించుకుంది. అయితే సిబ్బంది తనిఖీల సమయంలో ఆమె శరీరంలోని మెటల్ పీస్ ఇండికేటర్ ఆన్‌లో ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో ఆమెను ఫిజికల్ టెస్ట్‌ల తనిఖీ నిమిత్తం ఫ్రిస్కింగ్ బూత్‌కి తీసుకువెళ్లారు. అంతేకాదు తుంటి ఎముక సర్జరీ జరిగిన ప్రాంతం చూపించమంటూ సిబ్బంది బలవంతం చేశారు. పైగా ఆమె లోదుస్తులను తొలగించి నగ్నంగా చెక్ చేశారు. దీంతో ఆ మహిళ కూతురు కికాన్ ట్విట్టర్లో.. "నా 80 ఏళ్ల తల్లి టైటానియం ఇంప్లాంట్‌కు ప్రూఫ్ కావాలని ఆమెను దుస్తులు విప్పమని బలవంతం చేసారు. ఈ విధంగానా సీనియర్ సిటిజన్ల పట్ల వ్యవహరించేది అని మండిపడ్డారు". అంతేకాదు ఆమె ట్విట్టర్ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్ గౌహతిలో జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని పేర్కొంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ట్విట్టర్లో ఫిర్యాదుదారుపై స్పందిస్తూ..తాను కూడా ఈ విషయమై విచారణ చేస్తున్నాని తెలియజేయడమే కాకుండా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. (చదవండి: వీడియో: హుషారుగా గంతులేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. అందులో ఎక్స్పర్ట్ కూడా!) -
విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు
కోల్‌కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్‌ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్ వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు. -
అసభ్య ప్రవర్తనపై రైల్వే ఉద్యోగి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రైలులో ప్రయాణిస్తున్న తోటి మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించి, టిక్కెట్ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడనే ఫిర్యాదుతో అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్‌ను బుధవారం రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అసభ్య ప్రవర్తన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో కేసు నమోదుకు అవకాశం లేకపోవడంతో రెండో కేసుగా జీఆర్పీకి అప్పగించారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి మచిలీపట్నం–విశాఖపట్నం ప్యాసింజర్ రైల్లో ఎస్–1 బోగీలో ప్రయాణిస్తున్న చోడిశెట్టి అనూషపై అదే రైల్లో ప్రయాణిస్తున్న రైల్వే అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో రైల్వే టిక్కెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, ఆ విషయం అడిగేందుకు వచ్చిన టీసీపై సైతం తిరగబడటంతో తోటి ప్రయాణికుల సహాయంతో 182కు ఫిర్యాదు చేశారన్నారు. రైలు రాజమహేంద్రవరం చేరే సమయానికి ప్లాట్‌ఫామ్ పైకి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై సతీష్‌ను అదుపులోనికి తీసుకున్నామన్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న నేరానికి, టీసీపై ఎదురుదాడికి దిగిన నేరానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో లేక పోవడంతో ఆ నేరాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జీఆర్పీ డీఎస్పీ ఎస్ మనోహరరావును వివరణ కోరగా సంఘటన జరిగిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం లోనిదని, ముద్దాయిని అదుపులోనికి తీసుకుని భీమవరం తరలించినట్లు తెలిపారు. భీమవరం పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
విమానాశ్రయంలో చెంపదెబ్బలు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగుచూస్తుండటం తెలిసిందే. ఇండిగో సంస్థ సిబ్బంది అయితే ఓ ప్రయాణికుడిని రన్‌వేపైనే కిందపడేసి కొట్టారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ వివాదాస్పద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ప్రయాణికురాలు, ఎయిరిండియా విమానయాన సంస్థ అధికారిణి ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ–109 నంబర్ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ టికెట్ బుక్ చేసుకున్నారు. చెక్–ఇన్ కౌంటర్ వద్దకు నిర్దేశిత సమయం కన్నా 35 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ప్రయాణికురాలిని విమానమెక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో గొడవ మొదలైంది. ఎయిరిండియా నిబంధనల ప్రకారం దేశీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి కనీసం గంటంబావు ముందే చెక్–ఇన్ కౌంటర్ వద్దకు చేరుకోవాలి. కానీ సదరు ప్రయాణికురాలు కేవలం 40 నిమిషాలు ముందుగా వచ్చారు. దీంతో కౌంటర్లోని సిబ్బంది ఆమెను విమానమెక్కేందుకు అనుమతించకపోవడంతో ప్రయాణికురాలు వారితో వాదనకు దిగారు. దీంతో ఎయిరిండియా డ్యూటీ మేనేజర్‌గా ఉన్న అధికారిణి వద్దకు ప్రయాణికురాలిని సిబ్బంది పంపారు. అక్కడ వారిద్దరి మధ్య వాదనలు తీవ్రస్థాయికి చేరాయి. ఓ దశలో సంయమనం కోల్పోయిన ప్రయాణికురాలు అధికారిణిపై చేయిచేసుకున్నారు. వెంటనే అధికారిణి కూడా ప్రయణికురాలి చెంప చెల్లుమనిపించారు. తర్వాత వారిద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారని పోలీసులు చెప్పారు. -
క్యాబ్‌లో దాడి.. ఉబర్‌పై యువతి పిటిషన్
వాషింగ్టన్: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా యువతి పిటిషన్ దాఖలుచేసింది. ఉబర్ సంస్థతో పాటు దాడి చేసిన ప్యాసింజర్ నుంచి తనకు రూ.32.53 లక్షలు నష్టపరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చికాగోకు చెందిన 25 ఏళ్ల జెన్నిఫర్ కమాచో గత జవనరి 30న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. షేరింగ్‌లో మరో ప్యాసింజర్ కూడా క్యాబ్‌లో జర్నీ చేశారు. ఉబర్ క్యాబ్ ఎక్కిన కొంత సమయం తర్వాత ముందు సీట్లో కూర్చున్న ప్యాసింజర్ తనపై దాడికి పాల్పడ్డారని పిటిషన్లో జెన్నిఫర్ పేర్కొంది. తన ముఖంపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనట్లు తెలిపింది. ఆస్పత్రి బిల్లులు, తన పడ్డ బాధకు, కోల్పోయిన సమయానికి మొత్తంగా 50 వేల అమెరికన్ డాలర్లు నష్టపరిహారం కోరుతూ కుక్ కౌంటీ సర్క్యూట్ కోర్టును ఆశ్రయించింది. జెన్నిఫర్ పై దాడికి పాల్పడ్డందుకు 34 ఏళ్ల రేమర్ను చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరీతో రేమర్ దాడిచేసి జెన్నిఫర్‌ను గాయపరిచినట్లు రుజువైంది. అటార్నీ బ్రేయాంత్ గ్రీనింగ్ మాట్లాడుతూ.. ఉబర్ క్యాబ్ వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
భర్త కళ్లుగప్పి.. కుష్బూ పరార్
-
కుష్బూ కిడ్నాప్.. హై డ్రామాకు తెర!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలు అదృశ్యం అయిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. దుబాయి నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన అభినవ్ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోనే కుష్బూ కనిపించకపోవడం కలకలం సృష్టించింది. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి పరిశీలించారు. భర్త కళ్లుగప్పి ఆ మహిళ ఎయిర్ పోర్టు నుంచి క్యాబ్ లో వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త, ఆమె కుటుంబంతో తలెత్తిన విభేదాల కారణంగానే ఆ ప్రయాణికురాలు ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. విమానం ఎక్కేందుకు కొంత సమయం ముందు తామిద్దరం ఎయిర్‌పోర్టులో షాపింగ్ చేసేందుకు వెళ్లినట్లు అభినవ్ కుమార్ తెలిపారు. ఆ క్రమంలో కొంతసేపటికే తన భార్య అదృశ్యమైందంటూ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి.. కుష్బూను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. -
విమానాశ్రయంలో ప్రయాణికురాలు అదృశ్యం
-
గగుర్పొడిచే షాకింగ్ ఘటన!
ఓ మహిళ పట్టుతప్పి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద కిందపడిపోయి అలాగే దొర్లుతూ వెళ్లి రైలు కింద పడబోతుండగా చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి సాయం చేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని థానేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఓ మహిళ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ జంక్షన్ కు వచ్చింది. అయితే అప్పటికే తాను వెళ్లాల్సిన ట్రైన్ సమయానికి స్టేషన్ చేరుకోలేక పోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో స్టేషన్ నుంచి ఓ రైలు వెళ్తుంది. అది తాను ఎక్కాల్సిన ట్రెయిన్ అనుకుని ఎలాగోలాగ కష్టపడి ఎక్కింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రన్నింగ్ ట్రెయిన్ ఎక్కిన ఆ మహిళకు షాక్.. అది తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న మహిళా ప్యాసింజర్ ఒక్కసారిగా ప్లామ్ ఫాం మీదకి దూకేశారు. అసలే అది రన్నింగ్ ట్రెయిన్ కావడంతో పట్టుతప్పి కిందపడిపోయిన ఆమె క్షణాల్లో దొర్లుకుంటూ రైలు కింద పడబోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ మహిళ ట్రెయిన్ కింద పడకుండా రక్షించారు. అయితే ఈ ఘటనలో మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన!
-
నిందితుడిని పట్టించిన 'గబ్బర్‌సింగ్'
ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన నగలు, నగదుతో ఉడాయించిన ఆటో డ్రైవర్‌ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సొత్తు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ ఠాణాలో ఏసీపీ వేణుగోపాలరావు, సీఐ కాశిరెడ్డితో కలిసి డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్కేపురం వాసవి కాలనీ నివాసి జి.మాధవి గతనెల 11న నల్లగొండ వెళ్లేందుకు ఆర్కే పురం నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వరకు ఆటోలో ప్రయాణించారు. 30 తులాల నగలు, రూ. 25 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయారు. బస్ ఎక్కి ఆటోనగర్ వరకు వెళ్లిన తరువాత బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే వెనక్కి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో లోపల గబ్బర్‌సింగ్ అని పేరు రాసి ఉందని బాధితురాలు చెప్పింది. ఆ ఆధారంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు ఆటో నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం జనగాం పల్లగుట్ట తండాకు చెందిన కళావత్ బోజ్యా(32)దిగా గుర్తించారు. నగలను విక్రయించేందుకు అతను ఎల్బీనగర్లోని ఓ నగల దుకాణానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడి వద్ద నుంచి ప్రయాణికురాలికి చెందిన 30 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
అసభ్య ప్రవర్తనతో ఉబర్ డ్రైవర్ అరెస్ట్
బెంగళూరు : ఉబర్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. మహిళ ప్రయాణికురాలిని వేధించిన ఘటనలో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే క్యాబ్ ఎక్కిన తనతో ఉబర్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ ట్విట్టర్ ద్వారా తమకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మహిళ ఫిర్యాదుతో క్యాబ్ డ్రైవర్ సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడు రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉబర్ కారు డ్రైవర్ మహిళను దారుణంగా రేప్ చేయటంతో ఢిల్లీ సర్కారు ఏకంగా ఉబర్ పై నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉబర్ డ్రైవర్ల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
'పొట్టి దుస్తులు వేసుకున్నదని నో ఎంట్రీ'
న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సరైన దుస్తులు వేసుకోలేదంటూ ఆమెను సిబ్బంది విమానాన్ని ఎక్కనివ్వలేదు. ఫ్రాక్ ధరించిన ఆమె ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్‌హోస్టెస్ మాత్రం అదే తరహా ఫ్రాక్‌లు ధరిస్తారు' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విషయమై పురబి దాస్ ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొని విమానంలో ప్రయాణించడం అనుమతించరని వారు పేర్కొన్నారు. -
అమ్మాయిల ఫోటోలు తీస్తూ బుక్కయ్యాడు
హైదరాబాద్ : సెల్ఫోన్లో అమ్మాయిల ఫోటోలు తీస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడో ఆకతాయి. దీంతో ఆ ఆకతాయికి అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు దిగి వస్తున్నఓ మహిళా ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తన ఫోన్లో ఫోటో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తన ఫోటో ఎందుకు తీశావంటూ అతడితో వాగ్వివాదానికి దిగింది. అయితే అతగాడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఈ విషయాన్ని గమనించిన సహ ప్రయాణికులు ఆ వ్యక్తిని నిలదీసినా ఫలితం లేకపోయింది. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని చూడగా అందులో చాలామంది అమ్మాయిలు ఫోటోలు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌కి వచ్చే అందమైన యువతల ఫోటోలను అతగాడు ఫోన్లో చిత్రీకరించటాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదారు. అనంతరం పోలీసులుకు సమాచారం అందించారు. వారు అతగాడిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అమ్మాయిల ఫోటోలు తీసి వాటిని దుర్వినియోగం చేయటం పరిపాటిగా మారుతున్న విషయం తెలిసిందే. -
మహిళ ప్రయాణికురాలిపై దాడి
ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలోని గోరేగావ్ స్టేషన్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ప్రయాణికురాలిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో రైల్వే పోలీసులు ఆమెను నాలాసొపారాలోని అలైన్స్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం ఘటనలు తాజాగా ఉండగానే మరో సంఘటన చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. రూపాలి షిండే అనే యువతి గోరేగావ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని గోరేగావ్ స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రైలు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి ఓ ఆగంతకుడు రూపాలి తలపై పదునైన ఆయుధంతో కొట్టడం ప్రారంభించాడు. అప్పటికే రైలు కదలడంతో సహచరులు ఆమెను వెంటనే రైలులోకి లాక్కున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కేకలు వేయడంతో చీకటిని అదునుగా చేసుకుని దాడి చేసిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో రక్తంతో తడిసిపోయింది. నాలాసోపారాలో రైలు దిగిన తర్వాత జరిగిన విషయం రైల్వే పోలీసులకు చెప్పారు. వీరు కేసు నమోదుచేసి ఈ విషయాన్ని గోరేగావ్ పోలీసులకు చేరవేశారు. రూపాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.