బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్‌ఆర్‌టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్‌టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్‌ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది.
2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్‌ఆర్‌టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్‌ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్‌టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్‌టీసీ అధికారులు సైతం వాధించారు.
ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు.
ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి
Comments
Please login to add a commentAdd a comment