
క్యాబ్‌లో దాడి.. ఉబర్‌పై యువతి పిటిషన్
వాషింగ్టన్: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా యువతి పిటిషన్ దాఖలుచేసింది. ఉబర్ సంస్థతో పాటు దాడి చేసిన ప్యాసింజర్ నుంచి తనకు రూ.32.53 లక్షలు నష్టపరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చికాగోకు చెందిన 25 ఏళ్ల జెన్నిఫర్ కమాచో గత జవనరి 30న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. షేరింగ్‌లో మరో ప్యాసింజర్ కూడా క్యాబ్‌లో జర్నీ చేశారు.
ఉబర్ క్యాబ్ ఎక్కిన కొంత సమయం తర్వాత ముందు సీట్లో కూర్చున్న ప్యాసింజర్ తనపై దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో జెన్నిఫర్ పేర్కొంది. తన ముఖంపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనట్లు తెలిపింది. ఆస్పత్రి బిల్లులు, తన పడ్డ బాధకు, కోల్పోయిన సమయానికి మొత్తంగా 50 వేల అమెరికన్ డాలర్లు నష్టపరిహారం కోరుతూ కుక్ కౌంటీ సర్క్యూట్ కోర్టును ఆశ్రయించింది.
జెన్నిఫర్ పై దాడికి పాల్పడ్డందుకు 34 ఏళ్ల రేమర్‌ను చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరీతో రేమర్ దాడిచేసి జెన్నిఫర్‌ను గాయపరిచినట్లు రుజువైంది. అటార్నీ బ్రేయాంత్ గ్రీనింగ్ మాట్లాడుతూ.. ఉబర్ క్యాబ్ వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.