సాక్షి, ముంబై : బహిరంగ మల, మూత్ర విసర్జనకు వ్యతిరేక ఉద్యమాన్ని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా చేసి మరీ మోదీ సర్కార్ మూడేళ్లుగా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకే చెందిన ఓ నేత చేసిన పని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర మంత్రి రామ్ షిండే.. సోలాపూర్-బర్షీ రహదారిపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వీడియో అది. కాన్వాయ్‌ను పక్కన ఆపించి మరీ పక్కనే పొదల్లోకి వెళ్లి ఆయన పని కానిచ్చేశాడు. ఆ వీడియో మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘‘ఓ మంత్రి ఇలా రోడ్డు పక్కనే స్వచ్ఛ్ భారత్‌కు తూట్లు పొడిచేశాడు. అంటే మోదీ పిలుపు ఘోరంగా వైఫల్యం చెందినట్లే’’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అంటున్నారు. సొంత మంత్రులే ఆయన చెప్పే నీతిపాఠాలను పాటించనప్పుడు ఇంక జనాల నుంచి దానిని ఆశించటం కరెక్ట్ కాదు. స్వచ్ఛ్ భారత్ కేవలం ప్రజలను కొల్లగొట్టేందుకే ప్రచారం చేస్తున్నారు అని బీజేపీపై మాలిక్ మండిపడ్డారు.
మంత్రి వివరణ...
ఇక ఈ వీడియోపై మంత్రి రామ్ షిండే స్పందించారు. ‘‘జలయుక్త శివార్ పథకం సమీక్ష కింద నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టా. ప్రయాణాలు.. వాతావరణంలోని మార్పులతో ఆరోగ్యం క్షీణించింది. గత రెండు రోజుల నుంచి జ్వరంగా కూడా ఉంది. రోడ్డు మీద వస్తున్న సమయంలో నాకు మరుగుదొడ్లు కనిపించలేదు. అందుకే రోడ్డు పక్కనే విసర్జించా’’ అని షిండే ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అయితే షిండే ప్రకటనపై శాంతించని ప్రతిపక్షాలు ఆయన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment