మూత్రానికి రూపాయి! | Get a rupee for a pee in Ahmedabad | Sakshi
Sakshi News home page

మూత్రానికి రూపాయి!

Published Fri, Jun 5 2015 11:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

మూత్రానికి రూపాయి!

మూత్రానికి రూపాయి!

అహ్మదాబాద్:  బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను నివారించడానికి అహమ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఒక ఐడియా వచ్చింది. అదే 'రూపీ ఫర్ పీ' స్కీం.  గురువారం నుంచి ఈ పథకాన్ని దీన్ని అమలు చేసేందుకు సర్వం సిద్దం చేశారు.  ఇక్కడ మూత్రం  చెయ్యి.. రూపాయి కొట్టు అనే  నినాదంతో  నగరంలో అనేకచోట్ల కాంప్లెక్స్లు వెలిశాయి. దాదాపు 67 సెంటర్లలో వీటిని నిర్వహిస్తున్నారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులను  మెరుగుపర్చేందకు ఏర్పాటు  చేసిన స్టాండింగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

నగరంలో  దాదాపు 300 పబ్లిక్  టాయిలెట్స్ సౌకర్యం ఉన్నా,  బహిరంగ మూత్ర విసర్జన వల్ల నగరంలో  67  ప్రాంతాల్లోని పరిసరాలు  దుర్గంధంగా, చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయని  స్టాండింగ్ కమిషన్  ఛైర్మన్  ప్రవీణ్  పటేల్  తెలిపారు.  అందుకే ప్రజల ఆరోగ్యం సంరక్షణార్థం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేశామనన్నారు. ప్రస్తుతానికి 67  సెంటర్లలో మాత్రమే  మూత్రానికి రూపాయి స్కీమ్ అమలు చేస్తున్నామని ఆయన  తెలిపారు.

పబ్లిక్  టాయిలెట్స్  వినియోగంపై ప్రజల్లో అవగాహన  తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని మున్సిపల్ సీనియర్ అధికారి తెలిపారు. చాలా వరకు స్లమ్ ఏరియాల్లో తమ స్కీమును ప్రవేశపెట్టామన్నారు. అందరూ విధిగా పబ్లిక్ టాయిలెట్ను వినియోగించాలన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు, జరిమానా విధిస్తామన్నారు.  వ్యాపార ప్రకటనల ద్వారా దీనికి సంబంధించిన వనరులను సమకూర్చుకుంటామని అధికారులు తెలిపారు.

కాగా  ఇలాంటి పథకాన్ని నేపాల్ రాజధాని కఠ్మండులో విజయవంతంగా అమలు చేసినట్టు సమాచారం.   అక్కడ దారేచౌక్ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఈ స్కీమును జనం  బాగా వాడుకున్నారట. కాగా ఏఎంసీ ప్రవేశపెట్టిన ఈ స్కీము సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement