వెరైటీ నిరసన.. కుక్కలకు మాత్రమే | Donald Trump Statues In New York Reads Pee On Me | Sakshi
Sakshi News home page

వెరైటీ నిరసన.. కుక్కలకు మాత్రమే

Published Sat, Oct 13 2018 11:03 AM | Last Updated on Sat, Oct 13 2018 11:31 AM

Donald Trump Statues  In New York Reads Pee On Me - Sakshi

వాషింగ్టన్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. పదవిలోకి వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర గడిచినా ఇంకా ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గలేదు. ఈ క్రమంలో ట్రంప్‌పై తనకున్న అసహ్యాన్ని తెలియజేయాడానికి ఓ వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నాడు న్యూయార్క్‌కు చెందిన ‘పోర్క్యపైన్‌ అర్మడిల్లా’ అనే వీడియో కంపెనీ యజమాని ఫిల్‌ గాబ్లే.

డొనాల్డ్‌ ట్రంప్‌ విగ్రహాలు తయారు చేయించి, వాటి మీద ‘పీ ఆన్‌ మీ’(నా మీద మూత్ర విసర్జన చేయండి) అని రాయించాడు ఫిల్‌ గాబ్లే. ఈ విగ్రహాలను న్యూయార్క్‌లోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించాడు. ఈ విషయం గురించి గాబ్లే ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ట్రంప్‌ అధ్యక్షుడిగా కాదు కదా కనీసం మనిషిగా కూడా పనికిరాడు. అతని మీద నా వ్యతిరేకతను తెలియజేయడం కోసం ఇలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాను’ అని తెలిపాడు.

అంతేకాక ‘ఈ స్యాట్యూలను న్యూయార్క్‌ పట్టణంలోని ఐదు ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేశాను. అయితే ఇక్కడ కేవలం కుక్కలు మాత్రమే మూత్ర విసర్జన చేయాలి. నా వరకూ ఇది హస్యంతో కూడిన వ్యంగ్యం’ అని వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement