న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్‌బ్యాక్‌కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment