న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన ఎ321 విమానంకు శనివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. పుణే విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఉన్న జీపును, డ్రైవర్‌ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్యూస్‌లేజ్ విభాగం(విమానం బాడీ) కాస్త దెబ్బతింది. అయితే విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఎన్‌పీఆర్‌పై త్రిపుర కీలక నిర్ణయం!)
ఇదే విషయమై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు స్పందిస్తూ.. 'పుణే ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ సమయంలో 120 నాట్స్ వేగంతో ఉంది. అయితే రన్‌వే మీద జీపును గమనించిన పైలట్ కాస్త ముందుగానే విమానాన్ని గాల్లోకి లేపడంతో విమానం బాడీ కాస్త దెబ్బతింది. అయితే విమనంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదానికి గురవ్వలేదు. పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రన్‌వేపై ఏదైనా గుర్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పూణే ఎటిసి(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సమన్వయం చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు సూచించాము. దీంతో పాటు విమానంలోని కాక్‌పిట్ రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఎయిర్‌ఇండియాకు తెలిపాం' అని పేర్కొన్నారు.
(సీఎం ప్రమాణ స్వీకారం.. 50 మంది అతిథులు వాళ్లే..!)
Comments
Please login to add a commentAdd a comment