Pune Airport
-
స్పైస్‌జెట్ విమానాల ద్వారా కరోనా టీకా రవాణా ఫోటోలు
-
గుడ్‌న్యూస్.. బయల్దేరిన ‘కోవిషీల్డ్’
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్‌తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకు శరవేగంగా ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్స్టిట్యూట్ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి వ్యాక్సిన్ డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం. (చదవండి: 6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు) తొలి విడత డోసులు పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్‌కు రానుండగా.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్ని టీకా రవాణా కోసం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. (చదవండి: తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే) Ready get set go! Stand by India! The vaccine to kill the disease is being loaded onto the aircrafts for distribution all over the country now.@AAI_Official @aairedwr pic.twitter.com/5lY9i4Tjdk — PuneAirport (@aaipunairport) January 12, 2021 కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా వేస్తారు. దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్ బయోటెక్ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు. -
రన్‌వే మీద జీపు; విమానంకు తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన ఎ321 విమానంకు శనివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. పుణే విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఉన్న జీపును, డ్రైవర్‌ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్యూస్‌లేజ్ విభాగం(విమానం బాడీ) కాస్త దెబ్బతింది. అయితే విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!) ఇదే విషయమై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు స్పందిస్తూ.. 'పుణే ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ సమయంలో 120 నాట్స్ వేగంతో ఉంది. అయితే రన్‌వే మీద జీపును గమనించిన పైలట్ కాస్త ముందుగానే విమానాన్ని గాల్లోకి లేపడంతో విమానం బాడీ కాస్త దెబ్బతింది. అయితే విమనంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదానికి గురవ్వలేదు. పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రన్‌వేపై ఏదైనా గుర్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పూణే ఎటిసి(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సమన్వయం చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు సూచించాము. దీంతో పాటు విమానంలోని కాక్‌పిట్ రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఎయిర్ఇండియాకు తెలిపాం' అని పేర్కొన్నారు. (సీఎం ప్రమాణ స్వీకారం.. 50 మంది అతిథులు వాళ్లే..!) -
ఎయిర్‌పోర్టులో జరిమానాల బాదుడు
పుణే : ఎయిర్‌పోర్టుల్లో జరిమానాలు పెరిగిపోయాయి. 15 వివిధ నేరాలకు సంబంధించి జరిమానాలు పెంచుతూ పుణే ఎయిర్‌పోర్టు అథారిటీలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు రూ.300-రూ.500 మధ్యలో ఉన్న ఈ జరిమానాలను రూ.2000- రూ.5000 మధ్యలో పెంచాలని నిర్ణయించినట్టు ఎయిర్‌పోర్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. టర్మినల్ బిల్డింగ్‌లోకి అనధికారికంగా ప్రవేశించడం, ఆపరేషనల్ ఏరియాల్లో డ్రైవింగ్ స్పీడుగా చేయడం, ఎయిపోర్టు సమీప ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించడం, దర్నాలు, ర్యాలీలు జరుపడం వంటి వాటికి ఈ జరిమానాలు వర్తిస్తాయని పుణే ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. టర్మినల్ బిల్డింగ్‌కు ముందు వాహనాలను అక్రమంగా పార్క్ చేస్తే, ప్రస్తుతం రూ.300-రూ.500 మధ్యలో ఉన్న ఈ జరిమానాను రూ.3000 వరకు వేయనున్నట్టు తెలిసింది. ఎయిర్‌పోర్టు వద్ద ప్రయాణికులను దించడానికి చాలా వరకు ప్రైవేట్ కార్లు ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఎయిర్‌పోర్టు బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టులో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తే రూ.5000, ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో పేపర్లు, కప్‌లు పడేస్తే రూ.2000, అనుమతి లేని ప్రదేశాల్లో పార్కింగ్‌కు రూ.3000, టర్మినల్ బిల్డింగ్‌లోకి అనధికారికంగా ప్రవేశానికి రూ.5000 జరిమానా విధించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి చెప్పారు. ఎక్కువ సమయం పాటు టర్మినల్ బిల్డింగ్ ఎదుట వాహనాలను ఆపి ఉంచడం నిషేధించామని అధికారులు పేర్కొన్నారు. అంతకముందు ఈ ప్రాంతంలో ఏడు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆపితే రూ.85 చెల్లించాల్సి వచ్చేంది. కానీ గత ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ మీటింగ్‌లో అర్థగంటకు రూ.30, గంటకు రూ.50 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎక్కువ సేపు పాటు ప్రయాణికులకు కోసం అక్కడ వేచిచూడటం వల్ల గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
ఉప్మా హాట్‌బాక్సుల్లో రూ.1.29 కోట్లు
న్యూఢిల్లీ: ఉప్మా ముసుగులో దుబాయ్‌కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పుణే విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుణే నుంచి దుబాయ్ వెళ్తున్న నిషాంత్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతని లగేజ్‌ను తనిఖీ చేశారు. లగేజ్‌లో హాట్‌బాక్సు ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉండడంతో పరిశీలించగా..ఉప్మా కింద 86,600 అమెరికా డాలర్లు, 15,000 యూరోలు బయటపడ్డాయి. దుబాయ్‌కి అదే విమానంలో వెళ్తున్న ఓ మహిళ లగేజ్ నుంచి ఉప్మా హాట్బాక్సులో దాచిన 86,200 డాలర్లు, 15,000 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: పుణే ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి చౌహాన్ (24) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని నేషనల్ ఇండస్ట్రీరియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా) క్వార్టర్స్‌లో ఈ సంఘటన చోటుచేసు కుంది. ఎస్ఐ వెంకన్న ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మురదాబాద్ జిల్లాకు చెందిన స్వాతి చౌహాన్ పుణే ఎయిర్‌పోర్టులో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది. స్వాతి చౌహాన్ బంధువు నీలం సింగ్ నిసాలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ.. క్వార్టర్ నం.59లో కుటుంబ సభ్యులతో కలసి నివాసముంటున్నారు. ఈ నెల 24న నీలం సింగ్ క్వార్టర్‌కు స్వాతి వచ్చింది. ఎప్పుడూ ఏదో బాధపడుతున్నట్లు కనిపించేది. దీనిపై నీలం అడిగినా వివరాలు వెల్లడించకపోగా.. జీవితమంటేనే విరక్తి కలుగుతోందని పలుమార్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం క్వార్టర్స్‌లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిసా అసిస్టెంట్ కమాండెంట్ ఎంఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. -
రూ.కోటి విలువైన బంగారం పట్టివేత
సాక్షి, ముంబై: దుబాయ్ నుంచి సుమారు నాలుగు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను పుణే విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ వారు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి... ముంబైలోని జోగేశ్వరిలో నివాసముంటున్న అగ్వాన్ అసమ్మ, దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో పుణేలో దిగింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, ఆమె నడుం చుట్టూ సుమారు నాలుగు కిలోల బరువున్న బంగారపు కడ్డీలు ఉండటం గమనించారు. వాటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ వాసా శేషగిరిరావు తెలిపారు. నిందితురాలిని పోలీసులకు అప్పగించామని తెలిపారు. -
మూడు మహా ప్రాజెక్టులకు ఓకే
న్యూఢిల్లీ: రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను సత్వరమే చేపట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం దేశరాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధానితోపాటు ఇతర ప్రధాన నగరాలను అభివృద్ధి బాటలో ముందుంచేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు. పుణే, నవీముంబైలలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతోపాటు నాగపూర్ విమానాశ్రయాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. కాగా ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 60 కిలోమీటర్ల పొడవున రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. కాగా, చర్చిగేట్-విరార్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం నగరవాసులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇందుకు కారణం ముంబైలో ట్రాఫిక్ స్థితిగతులపై మరొకసారి అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. 60 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్లు ఖర్చవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ప్రతిపాదిత ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చ వాన్ ఈ సందర్భంగా పీఎం మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు.