హైదరాబాద్: పుణే ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించే సబ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి చౌహాన్ (24) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని నేషనల్ ఇండస్ట్రీరియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా) క్వార్టర్స్‌లో ఈ సంఘటన చోటుచేసు కుంది. ఎస్‌ఐ వెంకన్న ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మురదాబాద్ జిల్లాకు చెందిన స్వాతి చౌహాన్ పుణే ఎయిర్‌పోర్టులో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. స్వాతి చౌహాన్ బంధువు నీలం సింగ్ నిసాలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ.. క్వార్టర్ నం.59లో కుటుంబ సభ్యులతో కలసి నివాసముంటున్నారు.
ఈ నెల 24న నీలం సింగ్ క్వార్టర్‌కు స్వాతి వచ్చింది. ఎప్పుడూ ఏదో బాధపడుతున్నట్లు కనిపించేది. దీనిపై నీలం అడిగినా వివరాలు వెల్లడించకపోగా.. జీవితమంటేనే విరక్తి కలుగుతోందని పలుమార్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం క్వార్టర్స్‌లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిసా అసిస్టెంట్ కమాండెంట్ ఎంఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు.
మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య
Published Wed, Mar 1 2017 2:21 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement