పుణే : ఎయిర్‌పోర్టుల్లో జరిమానాలు పెరిగిపోయాయి. 15 వివిధ నేరాలకు సంబంధించి జరిమానాలు పెంచుతూ పుణే ఎయిర్‌పోర్టు అథారిటీలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు రూ.300-రూ.500 మధ్యలో ఉన్న ఈ జరిమానాలను రూ.2000- రూ.5000 మధ్యలో పెంచాలని నిర్ణయించినట్టు ఎయిర్‌పోర్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. టర్మినల్ బిల్డింగ్‌లోకి అనధికారికంగా ప్రవేశించడం, ఆపరేషనల్ ఏరియాల్లో డ్రైవింగ్ స్పీడుగా చేయడం, ఎయిపోర్టు సమీప ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించడం, దర్నాలు, ర్యాలీలు జరుపడం వంటి వాటికి ఈ జరిమానాలు వర్తిస్తాయని పుణే ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. టర్మినల్ బిల్డింగ్‌కు ముందు వాహనాలను అక్రమంగా పార్క్ చేస్తే, ప్రస్తుతం రూ.300-రూ.500 మధ్యలో ఉన్న ఈ జరిమానాను రూ.3000 వరకు వేయనున్నట్టు తెలిసింది. ఎయిర్‌పోర్టు వద్ద ప్రయాణికులను దించడానికి చాలా వరకు ప్రైవేట్ కార్లు ఈ విధంగా వస్తూ ఉంటాయి.
ఎయిర్‌పోర్టు బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టులో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తే రూ.5000, ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో పేపర్లు, కప్‌లు పడేస్తే రూ.2000, అనుమతి లేని ప్రదేశాల్లో పార్కింగ్‌కు రూ.3000, టర్మినల్ బిల్డింగ్‌లోకి అనధికారికంగా ప్రవేశానికి రూ.5000 జరిమానా విధించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి చెప్పారు. ఎక్కువ సమయం పాటు టర్మినల్ బిల్డింగ్ ఎదుట వాహనాలను ఆపి ఉంచడం నిషేధించామని అధికారులు పేర్కొన్నారు. అంతకముందు ఈ ప్రాంతంలో ఏడు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆపితే రూ.85 చెల్లించాల్సి వచ్చేంది. కానీ గత ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ మీటింగ్‌లో అర్థగంటకు రూ.30, గంటకు రూ.50 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎక్కువ సేపు పాటు ప్రయాణికులకు కోసం అక్కడ వేచిచూడటం వల్ల గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment