డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు ఏకంగా రూ. 80 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా ఎందుకు విధించారు, కారణం ఏంటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), సిబ్బందికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవియేషన్ వాచ్‌డాగ్ 'ఎయిర్ ఇండియా' (Air India)కు రూ. 80 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై స్పాట్ ఆడిట్ నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన వెలువడిందని ఏవియేషన్ రెగ్యులేటర్ మార్చి 22న ఒక ప్రకటనలో వెల్లడించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆడిట్ నిర్వహించిన సమయంలో.. సిబ్బందిలో 60 ఏళ్లకు పైబడిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ పీరియడ్‌లు, అల్ట్రా-లాంగ్-రేంజ్ ఫ్లైట్‌లకు ముందు, తర్వాత సిబ్బందికి విశ్రాంతి ఇవ్వకపోవడం.. లేఓవర్‌ల సమయంలో అనేక ఉల్లంఘనలను వెల్లడించింది.
DGCA has imposed a financial penalty of Rs. 80,00,000 (Rupees eighty lakhs) to Air India Limited for violation of regulations pertaining to Flight Duty Time Limitations (FDTL) and fatigue management system (FMS) of flight crew: DGCA
— ANI (@ANI) March 22, 2024
Comments
Please login to add a commentAdd a comment