బరువు ఎక్కువ ఉండే బ్యాగులను అనుమతించొద్దని డీజీసీఏ పేర్కొంది.
న్యూఢిల్లీ: నిర్వహణ పరిమితులు (ఆపరేషనల్ లిమిటేషన్స్) ఉన్న విమానశ్రయాలకు నడిచే విమానాల్లో అధిక బరువు ఉండే బ్యాగులను అనుమతించొద్దని ఎయిర్‌లైన్స్‌కు విమానాయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ స్పష్టం చేసింది. రన్‌వే పొడవుపై పరిమితులతో పాటు హైయర్ ఎలివేషన్, తక్కువ గాలి సాంద్రత ఉన్న ఈ విమానాశ్రయాల్లో భద్రత నిబంధనలకు ఎయిర్‌లైన్స్ తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇలాంటి ఎయిర్‌పోర్టులు జమ్మూ కశ్మీర్‌లోని ‘లే’తో పాటు దేశవ్యాప్తంగా గణనీయ సంఖ్యలో ఉన్నాయి. ఉష్ణోగ్రత, పీడనం, ఎయిర్‌పోర్ట్ ఎలివేషన్, రన్‌వే కండీషన్ తదితర అనేక అంశాలపై విమానం టేకాఫ్/ ల్యాండింగ్ ఆధారపడి ఉంటుంది. బరువు ఎక్కువ ఉండే బ్యాగులను అనుమతించడం వల్ల ఓవర్‌లోడ్ అయ్యి భద్రతా సమస్యలు ఎదురవుతాయని, అందువల్ల వాటిని అనుమతించొద్దని డీజీసీఏ పేర్కొంది.