హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఇండియా ఫెసిలిటీలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసినట్టు సమాచారం.
తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబైలోని ఎయిర్ ఇండియా కేంద్రంలో బోయింగ్ పైలట్లకు శిక్షణ కార్యకలాపాలను డీజీసీఏ నిలిపివేసిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
డీజీసీఏ నిర్ణయంతో ఎయిర్ ఇండియాకు నిర్వహణ సవాళ్లు ఎదురు కానున్నాయి. న్యారో బాడీ, వైడ్ బాడీ విమాన పైలట్లకు సొంత కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. ముంబై ఫెసిలిటీలో బోయింగ్ 777, బీ787 ఎయిర్‌క్రాఫ్టŠస్, హైదరాబాద్ కేంద్రంలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment