
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు.
విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment