civil aviation services
-
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
ఆ విమానాశ్రయానికి అనూహ్య నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని భయపెడుతోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాల్లోని విమానాశ్రయాలు, పౌర విమాన సర్వీసులు తీవ్రంగా నష్టపోతోన్న విషయం తెలిసిందే. యూరప్‌లోని అత్యంత బిజీ విమానాశ్రయంగా గణతికెక్కిన ఇంగ్లండ్‌లోని ‘హీత్రో’ విమానాశ్రయం అనూహ్యంగా బారీ నష్టాలను గురయింది. ఈ ఏడాది 2020, మొదటి 9 నెలల్లోనే తమకు 1 .5 బిలియన్ పౌండ్లు (దాదాపు 14.5 వేల వేల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లినట్లు విమానాశ్రయం సీఈవో జాన్ హోలండ్ ప్రకటించారు. ఆ విమానాశ్రయానికి గత జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు ప్రయాణికుల రాకపోకలు 84 శాతం పడిపోయిందని సీఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో యూరప్‌లో అత్యంత బిటీ విమానాశ్రయంగా హీత్రోకున్న టైటిల్‌ను పారిస్‌లోని చార్లెస్ డీ గాల్లే తన్నుకు పోయింది. ఆమ్స్టర్డామ్ స్కిఫోల్, ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయాలు కూడా తమక గట్టి పోటీ ఇస్తున్నాయని జాన్ హోలండ్ తెలిపారు. ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు జరిపే విషయంలో జరగుతున్న ఆలస్యం కారణంగానే తమ విమానాశ్రయం వెనకబడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు అమలు చేస్తోన్న 14 రోజుల నిర్బంధం ప్రభావం కూడా హీత్రో విమానాశ్రయంపై పడింది. ఇతర దేశాల్లో క్వారెంటైన్ నిబంధనను ఏడెనిమిది రోజులకు కుదించారు. సమీప భవిష్యత్తులో తమ విమానాశ్రయానికి రెవెన్యూ రాకపోయినా నిల్వ నిధులు మరో 12 నెలల కాలానికి సరిపోతాయని సీఈవో తెలిపారు. -
విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి సేవలందించేందుకు సిద్ధమవుతోంది. లాక్డౌన్ వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తొలుత పరిమిత సంఖ్యలో విమానాలు నడిపేందుకు ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశీయ విమాన సేవల కోసం ఎయిర్‌పోర్టులోని ట్రాన్సిట్ టెర్మినల్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా టెర్మినల్‌లోని ఎరైవల్, డిపార్చర్ బ్లాకుల్లో బోర్డింగ్ కౌంటర్లు, కన్వేయర్ బెల్ట్స్ వద్ద మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించనున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం వారికి థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడుస్తాయి. ముందుగా న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు మాత్రమే ఇక్కడి నుంచి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. స్పైస్ జెట్ సంస్థ బెంగళూరు నుంచి విజయవాడకు మంగళవారం ఒకటి, మిగిలిన రోజుల్లో రెండు సర్వీస్‌లు చొప్పున నడపనుంది. ఇండిగో సంస్థ రోజుకు ఒకటి చొప్పున హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు సర్వీస్‌లను ప్రకటించగా, ఎయిరిండియా న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి రాత్రి సర్వీస్‌ను మాత్రమే నడపనుంది. ట్రూజెట్ సంస్థ కడపకు 26వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభించనుంది. ఈ సర్వీసులకుగాను ఇప్పటికే ఆయా విమాన సంస్థలు టికెట్ల బుకింగ్ మొదలుపెట్టాయి. -
భద్రం బీకేర్‌ఫుల్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దు చేసిన పరిస్థితుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని విమానాశ్రాయాలపై కేంద్రం డేగ కన్ను వేసింది. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన పౌరవిమానయాన భద్రతా విభాగం (బీసీఏఎస్) విమానాశ్రయాల లోపల, బయట తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరిస్తూ అన్ని విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డింగ్ వేళల సవరణ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమానాశ్రయాల్లోని అణువణువూ గాలించేలా బీసీఏఎస్ భద్రతా నియామావళిని జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద నుంచి విమానం లోపలికి వెళ్లేంతవరకు ప్రయాణికుల తనిఖీల్లో నిర్లిప్తత ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని బీసీఏఎస్ స్పష్టం చేసింది. ప్రయాణికుల బోర్డింగ్ వేళలను కూడా సవరించింది. ఈ మేరకు పాటించాల్సిన విధివిధానాలను ఎయిర్‌లైన్ సంస్థలకు పంపింది. దీనికనుగుణంగా బోర్డింగ్ పాస్ కోసం స్వదేశీ ప్రయాణికులు ఫ్లైట్ షెడ్యూల్‌కు మూడు గంటలకు ముందు, విదేశీయానానికి నాలుగు గంటల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది గంట, గంటన్నరలోపే ఉండగా.. దీనిని నాలుగు గంటల వరకు పెంచారు. ప్రయాణికులతో పాటు వారు వచ్చే వాహనాలపై కూడా నిఘా ఉంచాలని నిర్ణయిం చారు. ప్రయాణికులు పార్కింగ్ చేసే వాహనాలను ర్యాండమ్‌గా సమగ్ర తనిఖీలు చేయనున్నారు. అదనపు చెక్‌పోస్టుల ఏర్పాటు.. ప్రయాణికులు, వారు సంచరించే ప్రాంతాలే కాకుండా టర్మినళ్లు, విమానాల గ్రౌండింగ్ పాయింట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని బీసీఏఎస్ సూచించింది. అవసరమనుకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఆసాంతం డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేయాలని పేర్కొంది. కార్గో టర్మినళ్ల విషయంలో కూడా ఏమాత్రం అలసత్వం చేయకుండా చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకునే మార్గంలోనూ చెక్‌పోస్టులను విస్తృతం చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాలకు వచ్చే సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20వరకు అనుమతించకూడదని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ వారమంతా విమానాశ్రయాల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అపప్రద రాకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకునేలా బీసీఏఎస్ ఆదేశాలు జారీ చేసింది. -
త్వరలో వివిధ రాష్ట్రాలకు విమాన సేవలు
దావణగెరె, న్యూస్‌లైన్ : టాటా కంపెనీ, సింగపూర్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎయిర్ ఏషియా కంపెనీ భారత్‌లోని వివిధ రాష్ట్రాలలో పౌర విమానయాన సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీఎం.సిద్దేశ్వర్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జూన్ 15 నుంచి గోవా-చెన్నై మధ్య విమాన సర్వీసు ప్రారంభిస్తామని, ఇప్పటికే టికెట్ అమ్మకాల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ప్రయాణికులకు అనువుగా అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రైవేట్ ఎయిర్ లైన్ కంపెనీ ముందుకు వస్తే వారికి కూడా విమాన టికెట్ల అమ్మకం అవకాశం కల్పిస్తామన్నారు. ఈ దిశగా ప్రతి మూడు నాలుగు జిల్లాలకు ఒక విమానాశ్రయం, ఎయిర్‌స్ట్రిప్ స్థాపిస్తామన్నారు. దీంతో దేశానికి అధిక లాభం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి గత సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బళ్లారి విమానాశ్రయ భూస్వాధీన ప్రక్రియ జరగలేదన్నారు. బీజాపురలో 727 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, అయితే అక్కడ బండరాయి వచ్చిందని, దాన్ని తొలగించేందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఇంకా గుల్బర్గా, శివమొగ్గలలో విమానాశ్రయాల నిర్మాణ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని, శివమొగ్గలో నాసిరకం పనులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల లెసైన్సులను రద్దు చేసిందని వివరించారు. ఈ విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. హాసన్‌లో 760 ఎకరాలు అవసరముండగా అక్కడ 530 ఎకరాల భూమి మాత్రమే స్వాధీనం జరిగిందన్నారు. కారవార, బీదర్ జిల్లాలలో రక్షణ శాఖ విమానాశ్రయాలు నిర్మించనున్నారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.రామచంద్ర, మాడాళు విరుపాక్షప్ప, జయప్రకాశ్, హెచ్ఎస్.శివకుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.