సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని భయపెడుతోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాల్లోని విమానాశ్రయాలు, పౌర విమాన సర్వీసులు తీవ్రంగా నష్టపోతోన్న విషయం తెలిసిందే. యూరప్‌లోని అత్యంత బిజీ విమానాశ్రయంగా గణతికెక్కిన ఇంగ్లండ్‌లోని ‘హీత్రో’ విమానాశ్రయం అనూహ్యంగా బారీ నష్టాలను గురయింది. ఈ ఏడాది 2020, మొదటి 9 నెలల్లోనే తమకు 1 .5 బిలియన్ పౌండ్లు (దాదాపు 14.5 వేల వేల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లినట్లు విమానాశ్రయం సీఈవో జాన్ హోలండ్ ప్రకటించారు. ఆ విమానాశ్రయానికి గత జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు ప్రయాణికుల రాకపోకలు 84 శాతం పడిపోయిందని సీఈవో తెలిపారు.
ఈ నేపథ్యంలో యూరప్‌లో అత్యంత బిటీ విమానాశ్రయంగా హీత్రోకున్న టైటిల్‌ను పారిస్‌లోని చార్లెస్ డీ గాల్లే తన్నుకు పోయింది. ఆమ్‌స్టర్‌డామ్ స్కిఫోల్, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయాలు కూడా తమక గట్టి పోటీ ఇస్తున్నాయని జాన్ హోలండ్ తెలిపారు. ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు జరిపే విషయంలో జరగుతున్న ఆలస్యం కారణంగానే తమ విమానాశ్రయం వెనకబడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు అమలు చేస్తోన్న 14 రోజుల నిర్బంధం ప్రభావం కూడా హీత్రో విమానాశ్రయంపై పడింది. ఇతర దేశాల్లో క్వారెంటైన్ నిబంధనను ఏడెనిమిది రోజులకు కుదించారు. సమీప భవిష్యత్తులో తమ విమానాశ్రయానికి రెవెన్యూ రాకపోయినా నిల్వ నిధులు మరో 12 నెలల కాలానికి సరిపోతాయని సీఈవో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment