
డీజీసీఏకి సత్యవతి సారథ్యం
కొత్త డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)గా ఎం. సత్యవతి నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ పనిచేయడం ఇదే ప్రథమం.
న్యూఢిల్లీ: కొత్త డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)గా ఎం. సత్యవతి నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ పనిచేయడం ఇదే ప్రథమం. ప్రభాత్ కుమార్ స్థానంలో వచ్చిన 1982 ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.
ఈ పదవికి ముందు ఆమె పౌర విమానయాన శాఖకు అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. పాండిచ్చేరి ముఖ్య కార్యదర్శిగానూ పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ కేడర్ 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రభాత్ కుమార్‌ను మళ్లీ ఉత్తరప్రదేశ్‌కే పంపించారు. ఎఫ్‌ఏఏ వంటి అంతర్జాతీయ సంస్థలు లెవనెత్తిన పలు భద్రత లోపాలను సరిదిద్దడానికి ఆయన పలు విజయవంతమైన చర్యలు తీసుకున్నారు.