సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పైలట్ కొరత కష్టాలు వీడడం లేదు. గత కొన్నిరోజులుగా రోజూ విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నసంస్థ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. విమాన సర్వీసుల రద్దు ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనుందని ప్రకటించింది. రోజుకు కనీసం 30 విమాన సేవలు రద్దు కానున్నాయంటూ ఇండిగో కస్టమర్ల నెత్తిన బాంబు వేసింది.
ఎందుకంటే..చివరి నిమిషంలో ఇండిగో విమానాలు రద్దు కావడంతోపాటు, లాస్ట్ మినిట్ విమాన టికెట్ల బుకింగ్ చార్జీలతో ప్రయాణికుల భారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఈ అసౌకర్యతను నివారించడానికి, ముందుగానే సంబంధిత సర్దుబాట్లు చేస్తున్నామని, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నామని ఇండిగో చెబుతోంది. కాగా సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో 32విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా వెల్లడించింది.
ఇది ఇలా వుంటే ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment