aviation department
-
ఏటా 40 కోట్ల మంది విమాన ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వుల్నామ్ తెలిపారు. సీప్లేన్ల కార్యకలాపాల కోసం తగిన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘దేశంలో విమానయాన రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం దేశీయంగా 11 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య రెట్టింపై 22 కోట్లకు చేరుకుంది. 2029 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణం పట్ల ప్రజల్లో ఆకాంక్ష ఉంది’ అని వివరించారు. సేవలు అందించని, లేదా తక్కువ సేవలందించే ఎయిర్‌పోర్టుల నుండి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు విమాన ప్రయాణ వ్యయానిన మరింత తగ్గించడం ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ (ఆర్సీఎస్) పథకం లేదా ఉడాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 1.46 కోట్ల మంది.. హెలికాప్టర్లు, సీప్లేన్ల కార్యకలాపాలను పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వుమ్లున్మాంగ్ వివరించారు. 2016 అక్టోబర్‌లో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ప్రారంభమైంది. దీని కింద 2024 నవంబర్ 30 నాటికి 13 హెలిపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్లుసహా సేవలు అందించని, తక్కువ సరీ్వస్‌లు ఉన్న 87 విమానాశ్రయాలను కలుపుతూ 613 మార్గాలు అందుబాటులోనికి వచ్చాయి. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఇప్పటివరకు 2.86 లక్షల సర్వీసుల ద్వారా 1.46 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్లో పార్లమెంటుకు తెలిపింది. -
గతి శక్తి విశ్వవిద్యాలయం, ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం.. ఎందుకంటే..
భారత విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ), ఎయిర్‌బస్ పరస్పరం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 2023లో జరిగిన ఎంఓయూను అనుసరించి ఎయిర్‌బస్ ఎండీ రెమి మెయిలార్డ్, జీఎస్వీ వైస్ ఛాన్స్లర్ మనోజ్ చౌదరి మధ్య న్యూదిల్లీలోని రైల్ భవన్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం..భారత్‌లోని విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు జీఎస్వీ, ఎయిర్‌బస్ మద్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విమాన రంగంలో రాణించాలనుకునే వారికి ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తారు. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో 40 మందికి పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘సబ్కా సాథ్ సబ్కా వికాస్.. అనే స్ఫూర్తితో కేంద్రం విమానయానం, హైవేలు, రైల్వేలు, రోడ్డు రవాణాను అభివృద్ధి చేస్తోంది. దానికి అందరి సహకారం అవసరం. అన్ని రవాణా రంగాలను ఏకీకృతం చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని జీఎస్వీని ఏర్పాటు చేశాం. ఆయా రంగాల్లో తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా అందులో ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఇందులో రైల్వే శిక్షణ ఇచ్చాం. విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో విప్లవాత్మక మార్పులు రావాలి. కాబట్టి ప్రస్తుతం సివిల్ ఏవియేషన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం జరిగే శిక్షణకు ఎయిర్‌బస్ సహకరిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి రెట్టింపయింది. ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులు టైర్ II, టైర్ III నగరాలకు విస్తరించాయి. ఈ రంగం పురోగతికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతి శక్తి విశ్వవిద్యాలయానికి పూర్తిగా సహకరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయవర్మ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: కట్టకుండానే కట్టేసినట్లు కలరింగా!?
సాక్షి, అమరావతి : అబద్ధాలు ఆడటంలో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు తర్వాతే ఎవరైనా. అవతలి వాళ్లు నవ్వుకుంటారన్న సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ.. నిత్యం వాటినే పారాయణ చేస్తూ తన స్థాయిని తనే బజారుకీడ్చుకుంటున్నారు. తాజాగా.. రాష్ట్రంలో విమానయాన రంగంపై ‘మాటలు మరిచారు.. రెక్కలు విరిచారు’ అంటూ ఎప్పటిలాగే తన సహజసిద్ధ శైలిలో తన విషపుత్రిక ఈనాడులో తన పాండిత్యాన్నంతటినీ రంగరించి రామోజీ విషం కుమ్మరించారు. ఎందుకంటే.. రాష్ట్రంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తూ పలు నగరాలకు సర్వీసులు పెరుగుతుంటే కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ అసత్యాలతో రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ఆపసోపాలు పడ్డారు. నిత్యం ఇలా అశుద్ధ కథనాలు రాస్తుండబట్టే పత్రిక సర్క్యులేషన్ రోజురోజుకీ దారుణంగా పడిపోతోంది. అయినాసరే.. తన బాబును పల్లకీ ఎక్కించేందుకు తన అసత్యాల యజ్ఞాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఈనాడును ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎలుక తోలును ఎంత ఉతికినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టిన వాటి సహజ లక్షణం ఎలా కోల్పోవో రామోజీ శైలి కూడా అంతే. ఈనాడు తాజా కథనంలోని వాస్తవాలు ఏమిటంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా బాబు హంగామా.. భూసేకరణ చేయకుండా, పునరావాసం చేపట్టకుండా, కనీసం పౌర విమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం వంటి ఎటువంటి కీలక అనుమతులు లేకుండానే చంద్రబాబునాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేసేశారు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకుని 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి.. ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమేసేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కేంద్రంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. అలాగే, విమానయాన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలోనూ విఫలమయ్యారు. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి కీలక అనుమతులు సాధించి పనులు మొదలుపెట్టారు. బాబు లాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మే 2023లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. కర్నూలు ఎయిర్పోర్టుదీ అదే కథ.. ఇక కర్నూలు ఎయిర్‌పోర్టుకు కూడా 2017లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తికాకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ, వాస్తవంగా అప్పటికి రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ వంటి కీలక నిర్మాణ పనులేవీ 30 శాతం కూడా పూర్తికాలేదు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తే ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించింది. ఇందుకోసం ఈ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాక.. కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్, అనుమతులతో పాటు ఎస్పీఎఫ్ ఫోర్స్‌లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేయడంతో ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది. తెట్టు వద్ద ఎయిర్‌కార్గో హబ్.. ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రతిపాదిస్తే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. ఎయిర్ కార్గొ హబ్‌గా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త నగరాలతో అనుసంధానం.. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం అనేక కొత్త నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే సర్వీసులు తగ్గిపోయాయి రెక్కలు విరిచేశారు అంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. నిజానికి.. కోవిడ్ దెబ్బతో ట్రూజెట్, జెట్ ఎయిర్వేస్ దివాలా తీయగా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేసింది. ఇలా కోవిడ్ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్ కారణమనడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు. అలాగే, విశాఖపట్నం నుంచి గత ప్రభుత్వంలో లేని జైపూర్, గోవా, కడప, కోల్‌కత, తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభమైన మాట రామోజీకి తెలియదనుకోవాలా లేక తెలిసినా తెలీనట్లు నటిస్తున్నారని అనుకోవాలా? అలాగే.. విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్‌లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు.. ఆస్ట్రేలియా, యూరప్‌లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది. రూ.20వేల కోట్లతో తీరప్రాంత అభివృద్ధి.. కేవలం ఎయిర్‌పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా పెద్దఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్లు వెచ్చిస్తోంది. విమానాశ్రయాల అభివృద్ధి.. మరోవైపు.. రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి అయిదింటిని ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ► కర్నూలు ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుట్టపర్తిని శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది. ► రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్‌వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ బిల్డింగ్‌లను నిర్మిస్తోంది. ► రాజమండ్రి విమానాశ్రయాన్ని రూ.350 కోట్లతో విస్తరణ పనులకు ఇటీవలే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా శంకుస్థాపన చేశారు. ► అదే విధంగా.. కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ► అలాగే, విజయవాడ టెర్మినల్, రన్‌వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. ► తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్ చేసే విధంగా ఎంఆర్ఓ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలెట్ శిక్షణా కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్స్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. విమాన ప్రయాణికుల వృద్ధి ఇలా.. -
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సపోర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో పౌర విమానాశ్రయంగా రూపొందనున్న వరంగల్ విమానాశ్రయాన్ని రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్సీఎస్)లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి డొమెస్టిక్ (దేశీయ విమానాలు నడిచే విమానాశ్రయం) విమానాశ్రయంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో.. విమానాశ్రయం సిద్ధమయ్యాక ఆర్థిక అడ్డంకులను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దీన్ని ‘ఉడాన్’పథకంలో అంతర్భాగంగా ఉన్న రీజినల్ కనెక్టివిటీ పథకంలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది. ఈ పథకంలో చేర్చే విమానాశ్రయాలకు మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుంది. ఈమేరకు ఈ స్కీంలో వరంగల్ విమానాశ్రయాన్ని చేర్చాలంటూ తాజాగా పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రతిపాదన తర్వాత ఇప్పుడు మరో లేఖ కూడా రాసింది. ఏర్పాట్లు ఎందుకంటే.. ప్రస్తుత అవసరాల ఆధారంగా ఏర్పాటవుతున్న చాలా విమానాశ్రయాలు, ఆ తర్వాత రకరకాల కారణాలతో కునారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగా ఉండటంతో విమానయాన సంస్థ (ఆపరేటర్లు)లు ఆసక్తి కోల్పోతున్నాయి. వెంటనే సర్వీసులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫలితంగా విమానాశ్రయాలనే మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక సమీపంలోనే మరో విమానాశ్రయం ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీంతో వరంగల్ విమానాశ్రయానికి డిమాండ్ ఎక్కువగా ఉండదన్న అభిప్రాయం గతంలో వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంతకాలం జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల, భారీ టెక్స్టైల్ పార్కు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ పార్కు, ఇతర సంస్థల రాకతో వరంగల్ పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ముందుకొచ్చి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అడిగిన మేరకు భూమిని సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైంది. భూమి బదలాయింపు జరిగిన ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూరులోని పాత ఎయిర్ స్ట్రిప్ అదీనంలో 750 ఎకరాల భూమి పోను, అదనంగా కావలసిన 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన కావడం తెలిసిందే. గత నెలాఖరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానించగా, ఇప్పుడు సంబంధిత అధికారులు భూసేకరణ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వరంగల్ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఆయా సంస్థల ఆసక్తి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశీయంగా విమానాలు నడుపుతున్న సంస్థలన్నీ ముందుకొస్తే దీనికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వాటిల్లో ఆ ఆసక్తి రావాలంటే ప్రభుత్వాల నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫండింగ్‌కు వీలు కల్పిస్తూ ఉడాన్ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీంను ప్రారంభించడం తెలిసిందే. ప్రయాణికులు విమానాలు ఎక్కే విషయంలో.. ఆశించిన డిమాండ్– ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ఆపరేటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆశించిన డిమాండ్ కనక లేకుంటే.. ఎంత నష్టం జరుగుతుందో లెక్కలేస్తారు. దాన్ని నష్టంగా భావిస్తారు. డిమాండ్ అంచనా– వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేదే వయబిలిటీ గ్యాప్‌ఫండ్. దాన్ని ఆపరేటర్లకు అందిస్తే వారు నష్టాలతో సంబంధం లేకుండా విమానాలను కొనసాగిస్తారు. ఎవరెంత భరిస్తారు.. రీజినల్ కనెక్టివిటీ స్కీంలో భాగంగా అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కేంద్రప్రభుత్వం 80 శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీన్ని ఆపరేషన్ మొదలైన మూడేళ్లపాటు కొనసాగిస్తారు. దీనికిందకు వరంగల్ విమానాశ్రయాన్ని తీసుకురావాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. త్వరలో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 విమానాశ్రయాలకు ఈ నిధి సమకూరుతున్నట్టు సమాచారం. -
వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఓకే?
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్ స్ట్రిప్ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించినా, పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే వీటి ఏర్పాటు సందిగ్ధంలో పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చి దశలవారీగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తొలుత వరంగల్‌లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసే కసరత్తులో భాగంగా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కోరిన మేరకు భూమిని సేకరించి అప్పగించనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సమావేశ ఎజెండాలో కూడా దీనిని చేర్చారు. 250 ఎకరాల భూసేకరణ మామునూరులో నిజాంకాలంలో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడుకలో లేదు. అక్కడ చిన్నòÙడ్డు తప్ప ఎలాంటి భవనం లేదు. ఒక పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే ఉంది. గోతులు పడి అది కూడా వినియోగించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అ«దీనంలో ఉంది. అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అంతమేర భూసేకరణ జరగాల్సి ఉంది. సమీపంలోనే పశసంవర్థక శాఖ కు చెందిన స్థలం అందుబాటులో ఉంది. కొంత సమీప గ్రామం నుంచి సేకరించాల్సి ఉంది. గ్రామస్తులకు ఎయిర్‌పోర్టుకు మరోవైపు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌కు ఈమేర కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఏడాదిన్నరలో సిద్ధం చేసేలా.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని రూ.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేస్తారు. రన్‌వే విస్తరణ, టెర్మి నల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్విసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తు తం దేశీయ విమానాశ్రయం (డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు)గానే ఏర్పాటు చేయనున్నారు. 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపొందనుంది. భవిష్యత్ అవసరాల ఆధారంగా విస్తరిస్తారు. దశలవారీగా ఇతర చోట్ల కూడా.. వరంగల్ మామునూరుతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వీటిని దశలవారీగా చేపట్టాలని ఇప్పుడు నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వరంగల్ కావటం, అక్కడ టెక్స్‌టైల్‌పార్కు, ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ తొలుత విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా!
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రయాణం మరింత సులభతరం కానుంది. దేశీయ ప్రయాణాల కోసం ఇక టెర్మినల్‌లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్ నుంచే బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టు ఆవరణలో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డిజి యాత్ర’ పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ తరహా సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడతో పాటు హైదరాబాద్, కోల్‌కతా, పూణే విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్‌లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా... ► డిజి యాత్ర యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ యాప్‌లో వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్, చిరునామా, ఫొటో, ఆధార్ ఆధారిత ధ్రువీకరణపత్రం అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారునికి డిజి యాత్ర ఐడీ వస్తుంది. దానిని వినియోగదారులు నమోదు చేసుకోవాలి. ► విమాన టికెట్ బుకింగ్ సమయంలో డిజి యాత్ర ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలి. విమాన ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్ పాస్‌ను కూడా యాప్‌లో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు సదరు విమానాశ్రయానికి చేరుతాయి. ► ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత టెర్మినల్ బయట ఈ–గేట్ వద్ద డిజి యాత్ర యాప్‌ను ఉపయోగించి బోర్డింగ్ పాస్ బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి, ఫేషియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత, ప్రయాణ వివరాలు సంబంధిత ఎయిర్‌లైన్స్ ఆన్లైన్లో ధ్రువీకరించుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే, బోర్డింగ్ పాయింట్ల వద్ద నిరీక్షించకుండా సులభంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు. ట్రయల్ రన్ దశలో... ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం ట్రయల్ రన్ దశలో ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి డిజి యాత్రలో నమోదైనవారి వివరాలతో ఈ సిస్టం పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు మరింత అవగాహన కలిగించేందుకు టెర్మినల్ ఆవరణలో డిజి యాత్ర యాప్‌కు సంబంధించిన స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఫ్లైట్ టికెట్స్: ఆ సీట్లకు భారీ డిమాండ్.. పైసలు ఖర్చవుతాయ్!
బ్లాక్ దందా అనే మాట గుర్తుందా. గతంలో ఈ మాటలు ఎక్కువగా సినిమా థియేటర్ కేంద్రాలలో వినేవాళ్లం. తన అభిమాన హీరో, హీరోయిన్ సినిమా కోసం ప్రేక్షకులు అదనంగా ఖర్చు పెట్టి కొనేవాళ్లు. తాజాగా ఈ తరహా పరిస్థితులు విమానయాన రంగంలోకి వచ్చాయని ఓ సర్వే అంటోంది. ఇటీవలే విమానాల్లో ప్రయాణికుడు కోరుకున్న చోట సీటు కావాలంటే అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందట! అసలు ఏవియేషన్ రంగంలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్‌లైన్స్‌కు అదనపు నగదును చెల్లించినట్టు తేలింది. దేశంలోని 351 జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో 30వేల మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో మూడో వంతు ప్రయాణికులు తాము ప్రయాణించిన విమానయాన సంస్థ ఉచిత సీటును ఎంచుకునే ఆప్షన్ ఇవ్వలేదని వెల్లడించారు. నిర్దిష్ట సీట్లకు, లగేజ్‌కు, ఎయిర్‌లైన్ లాంజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికుల నుంచి దేశీ ఎయిర్‌లైన్స్ అదనపు చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ 2015లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కాస్త ఎక్కువ జాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బుకింగ్ లేదా వెబ్ చెకిన్ చేసేటప్పుడు కొందరు ప్రయాణికులు ముందు వరుసల్లోనూ, ఎమర్జెన్సీ వరుసల్లోనూ సీట్లకు ప్రాధాన్యమిస్తుంటారు. ఇందుకోసం ఎయిర్‌లైన్స్ రూ. 200–1,500 వరకూ అదనంగా చార్జి చేస్తుంటాయి. ఇలాంటి ప్రాధాన్య సీట్లతో పాటు తగినంత స్థాయిలో ఉచిత సీట్లను కూడా ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. మరోవైపు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిమాండ్ ఉందంటూ ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు చెప్తున్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది. ‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
‘శంషాబాద్’ విస్తరణకు సహకరిస్తా
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా గౌరవార్థం సీఎం కేసీఆర్ ఆయన్ను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందన్నారు. వైద్య, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల హబ్‌గా హైదరాబాద్ మారిందని, దీంతో నగరానికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి పౌర విమానయాన శాఖ నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మామునూరు ఎయిర్‌పోర్టులో త్వరలో ఏటీఆర్ కార్యకలాపాలు.. రాష్ట్రం ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టులో ఏటీఆర్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతిక అనుమతి ఇస్తామమన్నారు. అలాగే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును వైమానిక దళం ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్‌నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలను పున:పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. చదవండి: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం -
విమానాశ్రయాల అభివృద్ధికి చొరవ తీసుకోండి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం భూ కేటాయింపు, నిధుల డిపాజిట్ వంటి విషయాలను వేగవంతం చేసే అంశంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఐదు రాష్ట్రాల సీఎంలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న విమానప్రయాణ డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే నాలుగైదేళ్లలో రూ.20 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి అవసరైన భూమిని ఇప్పటికే కేటాయించిందని పేర్కొన్నారు. అయితే తిరుపతి రన్‌వే విస్తరణ కోసం 14.31 ఎకరాలు, రాజమండ్రి సమీపంలో రెసిడెన్షియల్ కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు, కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూమిని కూడా త్వరగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని కోరారు. ఏలూరు కెనాల్‌ను దారిమళ్లించే పనులను వేగంగా పూర్తిచేస్తే విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో 4 వేల మీటర్ల మేర రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ పనులను చేపడతామని తెలిపారు. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా ఉడాన్ ప్రాజెక్ట్‌లను రాష్ట్రం నుంచి నిర్వహించేందుకు (విశాఖపట్నం–దుబాయ్) రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సమకూర్చాలని సూచించారు. దీన్ని త్వరగా పూర్తిచేస్తే బిడ్డింగ్‌కు మార్గం సుగమమై అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను తాజాగా మరోమారు కేంద్రప్రభుత్వం పొడిగించింది. అయితే ఈసారి లాక్డౌన్లో మరిన్ని సడలింపులకు అవకాశం ఇచ్చింది. రవాణా సౌకర్యాల విషయంలో కొన్ని వెసులుబాటులను ఇస్తూ మే 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తపై విమానయాన శాఖ కంపెనీలకు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ముఖ్యంగా సామాజిక దూరం విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కీలక సూచనలు చేసింది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు సామాజిక దూరం పాటించే క్రమంలో విమానంలో మధ్యలో ఉండే సీటును ఖాళీగా ఉంచాలని విమానయాన శాఖ ఆదేశించింది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మధ్యలో సీటును ఖాళీగా ఉంచాల్సి వస్తే ఆ సీటు ఖరీదు భారం మిగిలిన ప్రయాణీకులపై పడి టికెట్ ధర అధికమవుతుందని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఏవియేషన్ శాఖకు విన్నవించుకున్నాయి. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది) దీని గురించి ఆలోచించిన కేంద్రప్రభుత్వం మధ్యలో సీటు కేటాయించిన వారికి చుట్టూ కప్పబడి రక్షణ కవచంలా ఉండే గౌను అందించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీలను ఆదేశించింది. ఈ గౌనును జౌళి శాఖ అంగీకరించిన ఆరోగ్యప్రమాణాలతో తయారు చేయాలని విమానయాన శాఖ సూచించింది. దీనితో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, క్యాబిన్ ఎయిర్‌ను తరుచుగా మార్చుతుండటం, ఎలాంటి ఆహారాన్ని విమానాల్లో సరఫరా చేయకూడదని ఆదేశించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కొన్ని ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచొచ్చు. మధ్యసీటు ఖాళీగా ఉంచే అవకాశం ఉంటే విమానాల్లో కచ్ఛితంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని, ఒకే కుటుంబానికి చెందిన వారికి పక్కపక్కనే కూర్చొనే అవకాశం కల్పించవచ్చని విమానయాన శాఖ పేర్కొంది. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) మధ్యలో సీటు ఖాళీగా ఉంచే అంశంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ విమానాల్లో సామాజిక దూరం పాటించాలంటే మధ్యలో సీటును కచ్చితంగా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ ఆర్ధిక ప్రగతి గురించి కాకుండా ప్రజల ఆరోగ్యం గురించే చింతించాలని సూచించింది. మే7న వందేమాతరం మిషన్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే సమయంలో బయట ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం, మరి విమానాల్లో సామాజిక దూరం విషయం ఏంటి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ప్రశ్నించారు. అయితే విమానాల్లో మధ్య సీట్ల బుకింగ్‌కు కేవలం జూన్ 7 వరకు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టు తెలిపింది. బాంబే హైకోర్టులో ఈ మధ్యసీట్లు విషయానికి సంబంధించి పిటీషన్ దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టు రేపు విచారించనుంది. ఇదిలా ఉండగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉంచడాన్ని ఖండించారు. దీనివల్ల టికెట్ ధరలు అధికంగా పెరుగుతాయన్నారు. -
ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!
న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ శనివారం చెప్పారు. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో విమానాల రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నాయి. విమానాల్లో ప్రయాణించేవారు మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ కలిగి ఉండడం తప్పనిసరి కాదని హర్దీప్సింగ్ పురీ చెప్పారు. దాని బదులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, తమకు ఈ వైరస్ సోకలేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇస్తే సరిపోతుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో వచ్చేవారి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ చూపిస్తే వారిని క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు. వందే భారత్ మిషన్ కింద ఈ నెలాఖరు నాటికి విదేశాల నుంచి 50 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. మే 7 నుంచి మే 21వ తేదీ మధ్య 23 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. -
ఆ విమాన టికెట్ల రద్దుకు పూర్తి రీఫండ్
న్యూఢిల్లీ: లాక్డౌన్ మొదటి దశ కాలంలో విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లభిస్తుందని పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. కోవిడ్–19 వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడత లాక్డౌన్ కొనసాగగా, ఈ కాలంలో బుకింగ్స్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రద్దు రుసుము ఏమీ లేకుండా పూర్తి మొత్తం నగదు రూపంలో వెనక్కు వస్తుందని తెలిపింది. మే 3 వరకు ప్రయాణాలకు టికెట్ కొన్న వారికి ఇది వర్తిస్తుందని వివరించింది. పేర్కొన్న కాలంలో నగదుకు బదులుగా భవిష్యత్తు ప్రయాణానికి ఉపయోగపడే క్రెడిట్ అందనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ అంశంపై విమానయాన శాఖ గురువారం స్పష్టతనిచ్చింది. -
విమానానికీ వైరస్..!
టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారుతోన్న కోవిడ్–19(కరోనా) వైరస్.. ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎకానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారితీస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన పోటీవాతావరణం వంటి అనేక సమస్యలను నెట్టుకుంటూ ముందుకు సాగుతోన్న విమానయాన కంపెనీలకు ఇప్పుడు ఆక్యుపెన్సీ (ఒక విమానంలోని మొత్తం ప్రయాణికులు) సమస్య సవాలు విసురనుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా సోకిపోయే వైరస్ కావడంతో ప్రయాణికులు వీలైనంత తక్కువగా విమానయానం చేసేందుకే చూస్తారు. ప్రజలు ఇళ్లలోనుంచి వీలైనంత తక్కువగా బయటకు రావడం మంచిదని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం ఈ వైరస్ నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలో విమానయాన రంగం భారీగానే నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) విశ్లేషించింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి 29 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. విమాన రద్ధీ 4.7% వరకు తగ్గనుంది. అంటే, 2008 ఆర్థిక సంక్షోభం సమయం తరువాత విమానయాన రంగం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఇదేనన్నమాట. ఆసియా దేశాల్లో అధిక ప్రభావం చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. అక్కడికి సేవలందిస్తున్న ఎయిర్‌లైన్స్‌కు అపార నష్టాన్ని కలిగించనుంది. ఇక చైనాకు సర్వీసులు నడుపుతున్న కంపెనీలదీ ఇదే పరిస్థిదనేది ఐఏటీఏ అంచనా. గతంలో చైనాను అల్లాడించిన సార్స్(ఎస్ఏఆర్ఎస్) అనుభవాన్ని ప్రజలు మరిచిపోక పోవడం.. ప్రస్తుత వైరస్ కూడా ఇటువంటిదే అని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించడం అనేవి విమాన ప్రయాణాలను తగ్గించేవిగా కొనసాగుతున్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత సమయంలో అనేక సంస్థలు కుప్పకూలిపోయిన మాదిరిగా.. ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడుపుతున్న కంపెనీల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది. బ్రిటిష్ ఎయిర్వేస్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్తో పాటు అమెరికాకు చెందిన 3 అతిపెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాకు తమ సర్వీసులను రద్ధు చేసినట్లు ప్రకటించాయి. పరిస్థితి ఆధారంగా మే నెల చివరి వరకు నిలిపివేసే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2020లో అంతర్జాతీయ విమానయాన రంగ ప్రయాణం ప్రతికూలమేనని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ అలెగ్జాండర్ డి జునియక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంద న్నారు. ఈ ప్రాంతంలో విమాన రద్ధీ ఏకంగా 13% వరకు తగ్గనుందని ఐఏటీఏ అంచనావేసింది. -
రెక్కలు తొడిగేనా.. రివ్వున ఎగిరేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. పౌర విమానయాన శాఖ విజన్– 2040 తాజా నివేదిక ప్రకారం.. 2040 నాటికి దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 100 కోట్లు దాటుతుంది. ఇందుకు తగ్గట్లుగా రాబోయే 15 ఏళ్లలో దాదాపు 100 విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అంశంపై చర్చ ఊపందు కుంది. రాష్ట్రంలో చాలాకాలంగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్‌లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. మూడేళ్ల క్రితం ప్రయత్నాలు... 2015లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల డిమాండ్‌ను పరిశీలించింది. అయితే, అప్పటికే తెలంగాణలో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. 150 కి.మీ.ల పరిధిలో కొత్తగా ఎలాంటి ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయ కూడదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఓ అధ్య యనం చేసింది. కొత్త ఎయిర్‌పోర్టుల సాధ్యాసాధ్యా లపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అధ్యయనం చేసి గతంలో మూసివేసిన రామగుండం, వరంగల్ ఎయిర్‌పోర్టులను పునరుద్ధరించవచ్చని చెప్పింది. వీటితోపాటు నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం(కొత్తగూడెం) ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయవచ్చని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను పౌర విమానయాన శాఖ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. వరంగల్‌కే అధిక అవకాశాలు నిజాం హయాంలో వరంగల్ సమీపంలోని మామునూరులో భారీ విమానాశ్రయం ఉండేది. దీన్ని కాగజ్‌నగర్‌లోని పేపర్‌మిల్ అవస రాలు తీర్చేందుకు 1930లో హైదరాబాద్ ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద విమానాశ్రయమని ప్రతీతి. ఇండో– చైనా యుద్ధంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ విమానాశ్రయం సేవలందించింది. 1981 దాకా ఇది సేవలందించింది. ఇది 1875 ఎకరాల భూమి, 2 కి.మీ. రన్‌వే కలిగి ఉండటం గమనార్హం. ప్రస్తుతం అది మూసివేసి ఉంది. అది ఇప్పటికీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే ఉంది. ఈ లెక్కన ఇప్పటికే మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండటం, గతంలో సేవలందించి ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విమానాశ్రయ పునరుద్ధరణకే అధిక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఉడాన్ పథకంతోనైనా మోక్షం వచ్చేనా? ఇప్పటికే తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఆదిలా బాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటు అంశం కేంద్రం పరిశీల నలో ఉంది. పైగా ఉడాన్ రీజియన్ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా కేంద్రం ఎయిర్ కనెక్టివిటీని పెంచేం దుకు ప్రయ త్నిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రయత్నాలు ఫలించి కేంద్రం పచ్చ జెండా ఊపితే వీటి ఏర్పాటు లాంఛనం కానుంది. ఒకవేళ అదే నిజ మైతే.. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేయాలన్న తలం పుతో తెలం గాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించినట్లయితే తప్పకుండా విమానాశ్రయాల కల నెరవేరుతుందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అభిప్రాయపడు తున్నారు. రోజురోజుకూ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం వీటి అవసరం ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో..
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన అనంతరం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) భద్రతను కట్టుదిట్టం చేసింది. మునుపటికంటే హైసెక్యూరిటీతో మరింత అప్రమత్తమవుతోంది. దేశ చరిత్రలోనే ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో విమానాశ్రయాల్లోని రెస్టారెంట్లు, ఇతర కౌంటర్లు, విభాగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు ఇకపై విధిగా పాస్‌పోర్టును కలిగి ఉండాలన్న నిబంధన విధించింది. ఇప్పటివరకు వీరికి పాస్‌లు మాత్రమే జారీ చేయడం, ఆయా సంస్థలు/నిర్వాహకులు ఇచ్చే గుర్తింపు కార్డులతోనూ అనుమతించే వారు. ఇలా పాస్‌లు, గుర్తింపు కార్డులు ఇష్టానుసారం జారీ చేయడం వల్ల ప్రముఖుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఏదో రకమైన పాస్లతోనో, లేక సిఫార్సులతోనో విమానాశ్రయంలోకి వెళ్లిరావడం తేలిగ్గా జరిగిపోయేది. ఈ పాస్‌లతో రన్‌వే మినహా మిగతా ప్రాంతాల్లో వీరు విచ్చలవిడిగా తిరిగేవారు. గత నెల 25న జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నం ఘటనతో ఇటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విమానయాన సంస్థలతో పాటు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులోని విమానయాన సంస్థలు, రెస్టారెంట్లు, విమానయానేతర సంస్థల సిబ్బందికి కూడా పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న నిబంధనను అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు నంబర్‌ను కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్రితో పాటు వెంట వెళ్లేందుకు వ్యక్తిగత కార్యదర్శి/సహాయకుడిని మాత్రమే అనుమతిస్తారు. అయితే వారికి కూడా ఆధార్ తప్పనిసరి. సీఎంతోనే మొదలు ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్‌పోర్టులో బీసీఏఎస్ నిబంధనల అమలును ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లేందుకు సోమవారం విశాఖ వచ్చిన చంద్రబాబు ఎయిర్‌పోర్టు వీవీఐపీ లాంజ్‌లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత సహాయకులను కూడా ఎయిర్‌పోర్టు భద్రత, సీఐఎస్ఎఫ్ అధికారులు అనుమతించలేదు. చివరకు విమాన టిక్కెట్టు కొనుక్కుని లోపలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు కావడం వల్ల వారిని అనుమతించారు. ఇక సీఎం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారీ పెద్ద ఎత్తున అనుసరించే అధికారులను కూడా భద్రతా చర్యల్లో భాగంగా అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విమానాశ్రయంలోకి 43 మంది అధికారులను అనుమతించాలని విశాఖ ఆర్డీవో దరఖాస్తు చేయగా ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మంత్రులు సిఫార్సు చేసినా ఒప్పుకోలేదు. -
విమానయానాన్ని మరింత చేరువ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైమానిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరింత మందికి విమానయానాన్ని చేరువ చేస్తామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలసి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌబే మాట్లాడుతూ. అత్యంత ఆధునిక సదుపాయాలతో కేవలం 6 నెలల సమయంలో ఇంటరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్‌ను జీఎంఆర్ సంస్థ నిర్మించడాన్ని ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో ఆధార్ తరహాలో డిజియాత్ర సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తనిఖీలు లేకుండా ఫేస్ రికగ్నైజేషన్‌తో నేరుగా విమానం ఎక్కవచ్చని చెప్పారు. సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసేలా ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఓఆర్‌ఆర్‌లకు తోడుగా త్వరలోనే మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. ఏటా పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామనిఅన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) సీఈవో ఎస్టీకే కిశోర్, హైదరాబాద్ కస్టమ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌కుమార్, ఐబీ జాయింట్ డైరెక్టర్ విజయ్‌కుమార్, జీఎంఆర్ ఎయిర్‌పోర్టుల బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు పాల్గొన్నారు. -
విమాన ప్రయాణికులకు ఊరట!!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు, మరిన్ని సదుపాయాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు తెరపైకి తె చ్చింది. ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. దేశీయం గా ప్రయాణాల కోసం ఉద్దేశించిన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటల్లోగా క్యాన్సిల్ చేస్తే ఎలాంటి చార్జీలు విధించకూడదని ప్రతిపాదించింది. 24 గంటల లాకిన్ వ్యవధిలో ప్యాసింజర్ల పేర్లలో మార్పు లు .. చేర్పులు, ప్రయాణ తేదీలను సవరించుకోవడం మొదలైనవి ఉచితంగా చేసుకోవచ్చని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. విమానం బైల్దేరడానికి నాలుగు రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. విమాన ప్రయాణికుల హక్కుల పరిరక్షణ, సదుపాయాల కల్పనకు సంబంధించిన ముసాయిదా చార్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. ‘టికెట్‌ను బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ఎలాంటి చార్జీలు విధించకుండా రద్దు చేసుకునేలా విమానయాన సంస్థ లాకిన్ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. విమానం బైల్దేరడానికి 96 గంటల ముందు దాకా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది‘ అని సిన్హా చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ఒక్కో విధంగా క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. అసంబద్ధమైన చార్జీలు వసూలు చేస్తున్నాయని, రిఫండ్ ఇవ్వడం లేదని పలు సంస్థలపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించి, రెండు నెలల్లోగా నోటిఫై చేస్తామని సిన్హా తెలిపారు. చార్టర్లో మరిన్ని ప్రతిపాదనలు.. ♦ మార్గదర్శకాల ప్రకారం.. క్యాన్సిలేషన్ చార్జీలను టికెట్టుపై ప్రముఖంగా ముద్రించాలి. క్యాన్సిలేషన్ చార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ బేసిక్ ఫేర్, ఇంధన సర్‌చార్జీని మించరాదు. ♦ విమాన సర్వీసులో జాప్యం కారణంగా ప్యాసింజరు కనెక్టింగ్ ఫ్లయిట్‌ని అందుకోలేకపోయిన పక్షంలో ఎయిర్‌లైన్స్ రూ. 5,000 నుంచి రూ. 20,000 దాకా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆఖరు నిమిషంలో విమాన సర్వీసును క్యాన్సిల్ చేసిన పక్షంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లయిట్లో పంపాలి. అయితే, వాతావరణ సంబంధ సమస్యల కారణంగా జాప్యం జరిగితే మాత్రం ఎయిర్‌లైన్స్ బాధ్యత ఉండదు. ♦ ఒకవేళ ప్రయాణికుల బోర్డింగ్‌కు నిరాకరించినట్లయితే.. కనిష్టంగా రూ. 5,000 పైచిలుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ♦ త్వరలోనే విమానంలోనే వై–ఫై సదుపాయం అందుబాటులోకి. -
ఎగిరిన విమానాలు
► రైళ్ల సేవలకు ఆటంకాలు ►పలు రైళ్ల రద్దు ►మరికొన్ని సమయాల్లో మార్పు ►పునరుద్ధరణ చర్యలు ముమ్మరం ► ప్రయాణికులకు తీవ్ర కష్టాలు వర్దా విలయం నుంచి చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం కుదుట పడింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ తీసుకున్నాయి. రైళ్ల సేవలకు తీవ్ర ఆటంకాలు నెలకొని ఉన్నాయి. ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ సేవలు ఆగడంతో నగర వాసులకు తీవ్ర కష్టాలు తప్పలేదు. చెన్నైకు రావాల్సిన అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను విల్లుపురం, విరుదాచలంకు పరిమితం చేశారు. ఎగ్మూర్, సెంట్రల్ నుంచి బయలు దేరాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా ముందుకు కదిలాయి. సాక్షి, చెన్నై: గత ఏడాది వరదల తాకిడికి చెన్నై విమానాశ్రయం కొన్ని రోజుల పాటుగా మూత పడ్డ విషయం తెలిసిందే. గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి విమానయాన శాఖ అ›ప్రమత్తంగానే వ్యవహరించింది. ముందుగానే విమాన సేవల్ని రద్దు చేయడంతో పాటుగా, అనేక విమానాల్ని దారి మళ్లించడంతో వర్దా రూపంలో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. వర్దా రూపంలో రన్ వేలపై మూడు అడుగుల మేరకు నీళ్లు నిలవడంతో వాటిని తొలగించేందుకు భారీ మోటార్లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే నీటిని అడయార్ నది వైపుగా మోటార్ల ద్వారా తరలించి, ఉదయం ఐదు గంటలకు అంతా విమానాశ్రయం తెరిచారు. అయితే, విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు మరింత సమయం తప్పలేదు. ప్రయాణికులు లేకుండా కొన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియను ట్రయల్ రన్ తో అధికారులు విజయవంతం చేశారు. భద్రతా పరంగా తీసుకున్న చర్యలు ఆశాజనకంగా ఉండడంతో, చివరకు ఢిల్లీకి నివేదికను పంపించారు. అక్కడి నుంచి అనుమతి తదుపరి తొమ్మిది గంటల నుంచి విమానాల సేవలకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఒకటి రెండు విమానాలు ల్యాండింగ్ నిమిత్తం చెన్నై పరిసరాల్లో చక్కర్లు కొట్టాయి. తొలి విమానం తొమ్మిది గంటల సమయంలో టేకాఫ్ తీసుకుంది. తదుపరి పూర్తి స్థాయిలో కాకుండా, సమయానుగుణంగా విమానాల టేకాఫ్ సాగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు యథా ప్రకారం ల్యాండింగ్ తీసుకున్నాయి. రైళ్ల సేవలకు ఆటకంతో కష్టాలు: వర్దా గాలి బీభత్సానికి రైల్వే ట్రాక్‌ల వెంబడి చెట్లు నేల కొరిగాయి. అనేక చోట్ల నీళ్లు పట్టాల్ని చీల్చుకుంటూ ముందుకు సాగడంతో ఎక్కడికక్కడ రైళ్లను అధికారులు ఆపేశారు. ప్రధానంగా చెన్నై నగరంలో ప్రధాన రైల్వే మార్గాల్లో ఎలక్ట్రిక్ రైళ్లు మంగళవారం కూడా ముందుకు కదలలేదు. చెంగల్పట్టు నుంచి తాంబరం–బీచ్ వరకు ఎలక్ట్రిక్ రైళ్లు, బీచ్ నుంచి వేళచ్చేరి వైపుగా ఎంఆర్టీఎస్ సేవలు లేక శివార్ల నుంచి నగరం వైపుగా రావాల్సిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. రోడ్ల మీద చెట్లు విరిగి పడి ఉండడంతో బస్సుల సేవలు అంతంత మాత్రంగానే సాగాయి. దీంతో బస్సుల కోసం ఆయా స్టాప్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయక తప్పలేదు. అన్నీ బస్సులు కిక్కిరిసి ముందుకు సాగాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ నుంచి బయల్దేరాల్సిన అనేక రైళ్ల సేవలు ఆలస్యంగానే సాగాయి. కొన్ని రైళ్లను మంగళవారం కూడా రద్దు చేశారు. దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి చెన్నైకు ఎగ్మూర్‌కు ఉదయాన్నే రావాల్సిన రైళ్లన్నీ విల్లుపురం, విరుదాచలంకు పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి నెలకొంది. సెంగోట్టై, కన్యాకుమారి, అనంతపురి, చెందూరు తదితర ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కడికక్కడ ఆగడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఆగమేఘాలపై రైల్వే యంత్రాంగం, తమిళనాడు రోడ్డు రవాణా శాఖ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. విల్లుపురం నుంచి తాంబరం వరకు ప్రత్యేకంగా ఆ రైళ్లలోని ప్రయాణికుల కోసం బస్సులు నడిపారు. ఎగ్మూర్, సెంట్రల్ నుంచి బయల్దేరాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేయగా, కొన్ని నిర్ణీత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా బయల్దేరి వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.