పాన్‌ కార్డ్‌ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! | Inoperative PAN You Can not Make These Transactions | Sakshi
Sakshi News home page

Inoperative PAN: పాన్‌ కార్డ్‌ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు!

Published Thu, Jul 6 2023 1:13 PM | Last Updated on Thu, Jul 6 2023 1:14 PM

Inoperative PAN You Can not Make These Transactions - Sakshi

దేశంలో ప్రతి ఆర్థిక లావాదేవీకీ పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్‌ తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు తెరవవాలన్నా.. లోన్లు పొందాలన్నా.. చెల్లింపులు చేయాలన్నా.. ఆదాయపు పన్ను చెల్లించాలన్నా ఈ పాన్‌ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం, 2023 జూన్ 30లోపు ఆధార్ నంబర్‌ను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ గడువు కూడా ఇప్పుడు పూర్తయింది. ఆధార్‌ లింక్‌ చేయని పాన్‌ కార్డలు 2023 జూలై 1 నుంచి పనిచేయకుండా (ఇన్‌ఆపరేటివ్‌) పోయాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం.. పనిచేయని పాన్ కార్డు ఉన్న వారు కింది ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరు.

ఆ లావాదేవీలు ఇవే..

  • బ్యాంకులు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం (టైమ్ డిపాజిట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు మినహా).
  • డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీస్ కస్టోడియన్ లేదా సెబీ నియంత్రణలోని సంస్థల్లో డీమ్యాట్ అకౌంట్‌ తెరవడం.
  • హోటల్ లేదా రెస్టారెంట్‌కి ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం. 
  • విదేశీ ప్రయాణానికి లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు.
  • క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం
  • మ్యూచువల్ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయడం. 
  • డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000లకు మించి చెల్లింపులు
  • ఆర్బీఐ బాండ్లను పొందడం కోసం రూ. 50,000 మించి చెల్లింపులు 
  • బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒకే రోజులో రూ.50,000 లకు మించి నగదు జమ
  • బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్‌లు, బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేసేందుకు ఒకే రోజులో రూ. 50,000 లకు మించి నగదు చెల్లింపులు
  • టైమ్ డిపాజిట్‌కు సంబంధించి ఒక సారికి 50,000 లేదా సంవత్సరంలో మొత్తంగా రూ. 5 లక్షలకు మించి డిపాజిట్‌ చేయడం
  • ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్ ద్వారా రూ. 50,000లకు మించిన పేమెంట్లు
  • బీమా సంస్థకు జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000లకు మించి చెల్లించడం.
  • రూ. లక్షకు మించిన సెక్యూరిటీల (షేర్లు మినహా) అమ్మకం లేదా కొనుగోలు కోసం ఒప్పందంలోకి ప్రవేశించడం.
  • రూ. లక్షకు మించిన అన్‌లిస్టెడ్‌ కంపెనీ షేర్ల విక్రయం లేదా కొనుగోలులో పాల్గొనడం. 

ఇదీ చదవండి: ఆధార్‌-పాన్‌ లింక్‌ ముగిసింది.. ఇక మిగతా డెడ్‌లైన్ల సంగతేంటి? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement