చిన్ని చిట్కాలతో కూరగాయాలను, పళ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన, ఇంటిని, ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. అందుకావల్సింది ఓపిక. దీంతో పాటు ఎలాంటి హానికరం కాని మంచి రెమిడీలు కాస్త అనుభవం గడించిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణుల సాయం ఉంటే చాలు.
ఆకుకూరలు తాజగా ఉండాలంటే..
ఆకుకూరలు వాడిపోయినట్టుగా కనిపించినప్పుడు... వాటిని చల్లటినీటిలో వేయాలి. దీనిలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటినుంచి తీసేయాలి. ఇలా చేస్తే ఆకుకూరలు తిరిగి తాజాగా కనిపిస్తాయి.
యాపిల్ ముక్కలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలపైన కాసింత నిమ్మరసం పిండితే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
జుట్టు రాలే సమస్య తగ్గాలంటే..
ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
(చదవండి: సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!)
Comments
Please login to add a commentAdd a comment